Begin typing your search above and press return to search.
‘బ్రహ్మోత్సవం’ను డబుల్ డిజాస్టర్ అనాలేమో..
By: Tupaki Desk | 27 May 2016 2:09 PM GMTబ్రహ్మోత్సవం ఫస్ట్ వీక్ కలెక్షన్లు అఫీషియల్ గా వచ్చేశాయి. ఆ ఫిగర్స్ అంచనాలకు తగ్గట్లే ఉన్నాయి. సినిమాల కలెక్షన్లు వెల్లడించే వెబ్ సైట్ లెక్కలకు.. అఫీషియల్ గణాంకాలకు పెద్దగా తేడా ఏమీ లేదు. అధికారిక లెక్కల ప్రకారమే ‘బ్రహ్మోత్సవం’ తొలి వారంలో రూ.34 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నైజాం ఏరియాలో రూ.8.35 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా.. ఆంధ్రాలో రూ.12.8 కోట్లు వసూలు చేసింది. నైజాంతో పోలిస్తే ఆంధ్రా ఏరియా పరిస్థితి మెరుగే అని చెప్పాలి. నైజాంలో అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమా మీద ఏకంగా రూ.20 కోట్ల దాకా పెట్టింది. అందులో సగం రావడం కూడా కష్టమే అన్నట్లుంది పరిస్థితి.
రాయలసీమలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ కేవలం రూ.3.1 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇక్కడితో పోలిస్తే కర్ణాటకలో పరిస్థితి మెరుగు. అక్కడ రూ.3.5 కోట్ల కలెక్షన్ వచ్చింది. అమెరికాలో గ్రాస్ 1.09 మిలియన్ డాలర్లు కాగా.. షేర్ రూ.4.05 కోట్లు మాత్రమే. మిగతా దేశాల్లో రూ.1.25 కోట్లు.. రెస్టాఫ్ ఇండియా రూ.కోటి వసూలైంది. మొత్తం లెక్క రూ.34 కోట్లు. బ్రహ్మోత్సవం బిజినెస్ రూ.85 కోట్ల దాకా జరిగిందన్న సంగతి తెలిసిందే. అంటే వసూలు చేయాల్సిన దాంట్లో సగం కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దాదాపుగా ప్రతి ఏరియాలోనూ బయ్యర్లకు సగానికి సగం నష్టమే. అంటే ‘బ్రహ్మోత్సవం’కు డిజాస్టర్ అన్న మాట సరిపోదు.. డబుల్ డిజాస్టర్ అనాలేమో.