Begin typing your search above and press return to search.
బ్రహ్మోత్సవం.. ఈ డేట్లు వంద శాతం పక్కా
By: Tupaki Desk | 27 April 2016 6:15 AM GMTటాలీవుడ్ లో తెరలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఓ వైపు బాలయ్య వందో సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. మరోవైపు చిరంజీవి 150వ సినిమాకు ముహూర్తం కుదిరింది. ఇంకోవైపు ‘అ..ఆ’ సినిమా ఆడియో వేడుకకు డేట్ ఫిక్స్ అయింది. ఇక ఈ సమ్మర్ లోనే మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన ‘బ్రహ్మోత్సవం’ విషయంలోనూ ఫుల్ క్లారిటీ వచ్చేసింది. దీని ఆడియో.. సినిమా విడుదల తేదీలు ఖరారయ్యాయి. మహేష్ బాబు కుటుంబానికి సన్నిహితుడైన సీనియర్ పీఆర్వో బి.ఎ.రాజే స్వయంగా ‘బ్రహ్మోత్సవం’ గురించి కన్ఫర్మేషన్ ఇచ్చారు.
మే 6న హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో ‘బ్రహ్మోత్సవం’ ఆడియో వేడుక నిర్వహించనున్నారు. మే 20న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా సినిమా విడుదల కాబోతోంది. ముందు అనుకున్న ప్రకారం ‘బ్రహ్మోత్సవం’ ఆడియో వేడుకను తిరుపతిలో నిర్వహించాల్సింది. ఐతే అభిమానుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే వేదిక మార్చాల్సి వచ్చింది. తిరుపతిలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. అక్కడ ఓపెన్ ఆడిటోరియంలో వేడుక చేయాలి. అంటే మధ్యాహ్నం నుంచే ఏర్పాట్లు చేయాలి. అభిమానులు కూడా మధ్యాహ్నం నుంచే వేదిక వద్దకు చేరుకుంటారు. ఎండ ప్రభావంతో వడదెబ్బ తగిలే ప్రమాదం మెండుగా ఉంటుంది. పోలీసులకు కూడా అభిమానుల్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. అందుకే ఏ ఇబ్బందీ లేకుండా పరిమిత సంఖ్యలో అభిమానుల మధ్య ఎప్పట్లాగే శిల్ప కళా వేదికలో ఆడియో వేడుక చేసుకోవాలని మహేష్ భావించాడు.