Begin typing your search above and press return to search.
మూడు రోజులకూ హౌస్ ఫుల్!!
By: Tupaki Desk | 20 May 2016 4:24 AM GMTఅదే కదా ఒక స్టార్ హీరో సినిమా అంటే. అసలు ఒక స్టార్ ఇమేజ్ ఏంటీ అని ఎవరైనా అంటే.. దానిని రెండు విధాలుగా చెప్పొచ్చు. అసలు సినిమా టాక్ తెలియకుండానే తొలి వీకెండ్ మొత్తం హౌస్ ఫుల్‌కార్డులు పడటం.. ఇక ఫ్లాప్ అని టాక్ వచ్చినా 75% డబ్బులు రికవర్ చేయడం. అదే స్టార్ ఇమేజ్. తెలుగులో పవన్ - మహేష్ - చరణ్ - బన్నీ - ఎన్టీఆర్ వంటి కొందరు స్టార్లు మాత్రమే అది కలిగియున్నారు.
కట్ టూ.. టుడేస్ రిలీజ్ బ్రహ్మోత్సవం.. ఇటు తెలుగు రాష్ట్రంలలో తొలి మూడురోజుల షో లకు దాదాపు టిక్కెట్లు అయిపోయాయ్. ఎక్కడన్నా కింద వరుసలో కార్నర్ సీటు ఏదైనా అమ్ముడుపోకుండా మిగిలి ఉండొచ్చు.. లేదంటే ఆన్ లైన్ లో ఖాళీగా ఉన్న ఆ ఒక్క సీటునే చాలామంది బుక్ చేయాలని ప్రయత్నించడంతో బుక్కింగ్ కాకపోయి ఉండొచ్చు కాని.. అసలు శుక్ర, శని, ఆదివారాలకు సంబంధించి అన్ని టెక్కట్లనూ అమ్మేశారు ఆల్రెడీ. ఓవర్ సీస్ లో కూడా అంతే. అమెరికాలో కూడా మూడు రోజుల టిక్కెట్లు అయిపోయాయ్. మనకు అందుతున్న రిపోర్టు ప్రకారం.. ఆస్ర్టేలియా వంటి దేశాల్లో.. కేవలం బాహుబలికి మాత్రం తొలి మూడు రోజులూ హౌస్ ఫుల్సు పడ్డాయి. ఇప్పుడిక బ్రహ్మోత్సవమే ఆ ఫీట్ ను సాధించింది.
ఆ లెక్కన చూసుకుంటే తొలి మూడు రోజుల్లోనూ బ్రహ్మోత్సవం రికార్డు వసూళ్ళు చేస్తుందని ఇట్టే చెప్పేయవచ్చు. దాదాపు 50 కోట్ల షేర్ ను రాబట్టేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. టోటల్ గా 76+ కోట్లు వస్తే.. తెలుగు వర్షన్ కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా డిస్ర్టిబ్యూటర్లందరూ సేఫ్ అవుతారు. ఆ పైన వచ్చిందంతా ప్రాఫిటోత్సవమే!!