Begin typing your search above and press return to search.
గోదావరి నేటివిటీ అరవబ్యాచ్ కు ఎక్కుతుందా..?
By: Tupaki Desk | 16 May 2016 10:30 PM GMT మహేష్ బాబు అంతర్మధనంలో పడిపోయాడు.తన బ్రహ్మోత్సవం చిత్రం విషయంలో లేనిపోని అనుమానాలను పెట్టేసుకున్నాడు.దీనంతటికి కారణం బ్రహ్మోత్సవం తెలుగు - తమిళల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతూ ఉండడమే.నిజానికి తన మునుపటి శ్రీమంతుడు మాదిరిగానే బ్రహ్మోత్సవాన్ని మహేష్ భారీగా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు,తమిళ్లో ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చేలా చేసి తన శ్రీమంతుడి కలెక్షన్ రికార్డును తానే క్రాస్ చేయాలని కూడా చూస్తున్నాడు.తాజాగా టికెట్ రేట్లు కూడా బి - సి సెంటర్లో పెరగడంతో తన సినిమాకు ఇక ఢోకా లేదనే ఒపీనియన్ కు అయితే వచ్చేశాడు.అయితే ఉన్నట్టుంది బ్రహ్మోత్సవంలో అంతర్లీనంగా ఉన్నటువంటి నేటివిటీ సమస్య మహేష్ కు తలనొప్పిలా మారింది.
బ్రహ్మోత్సవం సినిమా అటు అరవ బ్యాచ్ కు కూడా అర్థమైతేనే ...కలెక్షన్స్ వందకోట్ల మార్క్ ను రీచ్ అవుతాయనే విషయాన్ని... ముందు నుంచి క్రిటిక్స్ చెబుతూనే ఉన్నారు.ఎందుకంటే ఈసినిమాకు డైరెక్టర్ అడ్డాల శ్రీకాంత్ .అతను రాసుకునే కథలకు గోదావరి జిల్లాలను బేస్ చేసుకునే స్క్రిప్ట్ వర్క్స్ చేయిస్తూ ఉంటాడు.అయితే అలా చేయించుకునే వర్క్ లకు అన్ని ప్రాంతాల వారు కనెక్ట్ అవ్వాలని లేదు కదా..అలాగే దక్షిణ తమిళనాడు ప్రాంతాలకు చెందిన నేటివిటీతో హిట్ తమిళ డబ్ సినిమాలు ఏవైనా మన దగ్గరికి వస్తే...మనం చాలా సార్లు కథ బాగున్నప్పటికీ వాటిని మనం రిజక్ట్ చేశాం.కేవలం కొంతమందికి మాత్రమే అవి నచ్చుతాయి.ఎందుకంటే అవి యూనివర్సల్ కాన్సెప్ట్ ను వదిలి నేటివిటీని పట్టుకుని వేలాడే చిత్రాలు కాబట్టి.ఇదే సూత్రం ఇటు బ్రహ్మోత్సవం చిత్రానికి వర్తిస్తుంది కాబట్టి మనం ఆ యాంగిల్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదే విషయం గురించి మహేష్ తెగ ఆలోచించేస్తున్నాడట.