Begin typing your search above and press return to search.
రెండున్నర గంటల పాటు బ్రహ్మోత్సవమే!!
By: Tupaki Desk | 17 May 2016 1:52 PM GMTఇవాల్టి రోజుల్లో సినిమా సక్సెస్ లో డ్యురేషన్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే మూడేసి గంటల పాటు సినిమా తీయాలని, చూపించాలని ఎవరూ అనుకోవడం లేదు. అయితే.. శ్రీకాంత్ అఢ్డాల కొంచెం పెద్ద సినిమాలే తీసే అలవాటు ఉన్న దర్శకుడు. బ్రహ్మోత్సవం కోసం తన అలవాటును కొంచెం మార్చుకున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం సమాచారం ప్రకారం బ్రహ్మోత్సవం నిడివి 156 నిమిషాలు. అంటే రెండు గంటలా ముప్ఫై ఆరు నిమిషాల పాటు అభిమానులకు మహేష్ బ్రహ్మోత్సవం చూపించనున్నాడన్న మాట. గతంలో మహేష్-శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 159 నిమిషాల డ్యురేషన్ కంటే.. బ్రహ్మోత్సవం తక్కువ లెంగ్త్ ఉందనే విషయం స్పష్టమైపోయింది. ఈ రెండు గంటల 36 నిమిషాల్లో టైటిల్స్ - స్మోకింగ్ యాడ్స్ కు కేటాయించే టైం ను మినహాయిస్తే.. రెండున్నర గంటల సినిమా మాత్రమే అని అర్ధం అవుతుంది. దర్శకుడు తను చెప్పదలచుకున్న పాయింట్ ని తక్కువ డ్యురేషన్ లోనే చెప్పాడని అర్ధం చేసుకోవచ్చు.
ఇంత ఎక్కువ కాస్టింగ్ తో.. ఇంత తక్కువ నిడివి తీయడాన్ని నిజంగా ప్రశంసించాల్సిందే. సెన్సార్ నుంచి చిన్న బీప్ కూడా లేకుండా క్లీన్ యూ సర్టిఫికేట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ మూవీ బ్రహ్మోత్సవం.. మే 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.