Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసిన మహేష్
By: Tupaki Desk | 19 May 2016 11:30 AM GMTతెల్లారితే చాలు పండగ చేసుకోవడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సిద్ధమైపోతున్నారు. బ్రహ్మోత్సవం కోసం బ్రహ్మాండమైన వేడుకలు ఇప్పటికే మొదలైపోగా.. మే 20 ఉదయానికల్లా ఇవి పీక్ స్టేజ్ కు వచ్చేస్తాయి. కానీ ఈ సమయంలో కొందరు మహేష్ ఫ్యాన్స్ మాత్రం బాగా డిజప్పాయింట్ అయ్యారు.
మహేష్ కి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఉన్న అనేకమంది తెలుగు ప్రజలతోపాటు తమిళ్ ఆడియన్స్ కూడా మన ప్రిన్స్ ని ఇష్టపడతారు. మహేష్ నటించిన గత మూవీ శ్రీమంతుడును.. తమిళ్ లో కూడా ఒకేసారి విడుదల చేయడంతో.. అక్కడ కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఈ సారి మాత్రం తెలుగు వెర్షన్ తోనే సరిపెట్టేస్తున్నారు. చైన్నై వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నా.. నేటివ్ లాంగ్వేజ్ లో చూసే అవకాశం లేకపోవడం నిరుత్సాహం కలిగించే విషయమే.
శ్రీమంతుడు విషయంలో.. మూవీ సిద్ధమయ్యాక మూడు వారాలకు పైగా టైం దొరకడంతో.. పక్కాగా డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి సాధ్యమైంది. కానీ బ్రహ్మోత్సవం తెలుగు వెర్షన్ నే.. ఆఖర్లో జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసి రిలీజ్ చేయాల్సి వచ్చింది. అది కూడా మే 20 డేట్ ని మహేష్ గట్టిగా పట్టుబట్టడంతోనే ఇదైనా సాధ్యమైంది. అందుకే తమిళ్ వెర్షన్ ను సిద్ధం చేయలేకపోయారని తెలుస్తోంది.