Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్సవం బిజినెస్ లెక్క 85 కోట్లు

By:  Tupaki Desk   |   19 May 2016 6:59 AM GMT
బ్రహ్మోత్సవం బిజినెస్ లెక్క 85 కోట్లు
X
మహేష్ బాబు టాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాసేందుకు రెడీ అయిపోయాడు. నాన్ బాహుబలి రికార్డులన్నిటినీ శ్రీమంతుడుతో బ్రేక్ చేసిన మహేష్.. ఇప్పుడు తన రికార్డులను తానే బ్రేక్ చేసేందుకు బ్రహ్మోత్సవం వస్తున్నాడు. ముందుగా ప్రీ రిలీజ్ బిజినెస్ లో శ్రీమంతుడుని మించి మార్జిన్ తో దాటేశాడు మహేష్. శ్రీమంతుడు చిత్రానికి 79 కోట్ల బిజినెస్ చేయగా.. ఇప్పుడు బ్రహ్మోత్సవం ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క 85 కోట్లను దాటింది.

నైజాం ఏరియా 18 కోట్లు - సీడెడ్ 8.5 కోట్లు - ఆంధ్ర 25.5 కోట్లకు అమ్ముడయ్యి రికార్డులు సృష్టించాయి. అలాగే కర్నాటక హక్కలను 6.75 కోట్లకు అమ్మగా.. ఓవర్సీస్ హక్కులు 13 కోట్ల రూపాయలకు విక్రయించారు. రెస్టాఫ్ ఇండియా బిజినెస్ 2 కోట్లకు క్లోజ్ అయింది. మొత్తం మీద థియేట్రికల్ బిజినెస్ 74 కోట్లకు చేరగా.. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులను 11.2 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది జీ తెలుగు.

సమ్మర్ సీజన్ కావడం - మహేష్ మంచి ఊపు మీద ఉండడం - బ్రహ్మోత్సవానికి పోటీగా మరో సినిమా లేకపోవడం, ఇండస్ట్రీలో అంచనాలు ఎక్కువగా ఉండడం, ప్రోమో-ట్రైలర్ లు ప్రామిసింగ్ గా ఉండడం.. ఫ్యామిలీ ఎంటర్టెయిరన్ అనే ఫీలర్ స్ప్రెడ్ కావడంతో.. బాగుందనే టాక్ వస్తే బ్రహ్మోత్సవానికి 85 కోట్ల టార్గెట్ ని అందుకోవడం కష్టం కాకపోవచ్చు. టాక్ డివైడ్ గా వస్తే మాత్రం ఇప్పటికే మూడు హిట్ సినిమాలు థియేటర్లలో ఉండడంతో ఆడియన్స్ కు ఇతర ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఫ్రభావం పడొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.