Begin typing your search above and press return to search.

బాగా కలర్ ఫుల్ బ్రహ్మోత్సవం అదిరే

By:  Tupaki Desk   |   7 May 2016 4:22 AM GMT
బాగా కలర్ ఫుల్ బ్రహ్మోత్సవం అదిరే
X
సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీకాంత్ అడ్డాల సినిమా స్టార్ట్ చేశాడనగానే బోలెడంత క్యూరియాసిటీ మొదలైంది. బ్రహ్మోత్సవం అంటూ పండగ పేరునే సినిమాకి పెట్టడమే కాదు.. సినిమాని కూడా ఓ పండగలాగే తీశాడన్నది ఇప్పటివరకూ ఉన్నటాక్. అసలు బ్రహ్మోత్సవం షూటింగ్ ని ఓ పాటతోనే స్టార్ట్ చేశారు. అదే 'వచ్చింది కదా అవకాశం' అని సాగే సాంగ్. ఇప్పుడీ పాటకే మేకింగ్ వీడియో ఇచ్చింది బ్రహ్మోత్సవం యూనిట్.

విజువల్ గా ఈ పాటను చూసేందుకు రెండు కళ్లు సరిపోవని చెప్పాలి. అంత కలర్ ఫుల్ సెట్ లో పిక్చరైజ్ చేశారు. సంగీత్ లో భాగంగా ఈ పాట ఉంటుందని.. జయసుధ మేకింగ్ వీడియోలో చెప్పేశారు. అలాగే ఈ ట్యూన్ పదికాలాలు నిలిచిపోతుందని, వింటుంటే ఈ వయసులో కూడా డ్యాన్స్ వేయాలని అనిపించిందని కూడా సీనియర్ నటీమణులు అంటున్నారు. పిక్చరైజేషన్ పరంగా అన్ని కలర్స్ ని అంత బ్రహ్మాండంగా డిజైన్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ ని, వాటిని అంత పర్ఫెక్ట్ గా చూపించిన సినిమాటోగ్రాఫర్ ని ఎన్ని పొగిడినా తక్కువే అనిపిస్తోంది.

ఇక మహేష్ బాబు లుక్ అయితే అదరహో అనాల్సిందే. వైట్ కోట్ తో జీన్స్ ప్యాంట్ వేసి.. ఎంత సింపుల్ గా ఉన్నాడో, అంత స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు మహేష్. ప్రిన్స్ ను పట్టుకొచ్చి సెట్ లో నుంచోబెడితే అన్న మాటలకు.. అర్ధం చెబుతున్నట్లుగా ఉన్నాడు సూపర్ స్టార్. కోట్లు పోసి ఈ ఒక్క పాటనే నెల రోజుల పాటు పిక్చరైజ్ చేయడంలో అర్ధం ఏంటో.. ఇప్పుడు విజువల్ గా చూస్తే అర్ధమవుతోంది కదూ.