Begin typing your search above and press return to search.
ఆకట్టుకుంటోన్న 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ గ్లింప్స్.. టెర్రిఫిక్ లుక్ లో కింగ్ నాగ్..!
By: Tupaki Desk | 31 May 2022 1:12 PM GMTబాలీవుడ్ నుంచి ఈ ఏడాది రాబోతున్న ప్రతిష్టాత్మక భారీ చిత్రం ''బ్రహ్మాస్త్ర''. తెలుగులో 'బ్రహ్మాస్త్రం' అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో రణబీర్ కపూర్ - అలియా భట్ - అమితాబ్ బచ్చన్ - మౌనీరాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీలో కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు.
బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాని మూడు భాగాలుగా ప్లాన్ చేశారు. ఫస్ట్ పార్ట్ ని ''బ్రహ్మాస్త్ర: శివ'' పేరుతో 2022 సెప్టెంబర్ 9న విడుదల చేయబోతున్నారు. రిలీజ్ కు 100 రోజులున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా రణబీర్ కపూర్ మరియు అయాన్ ముఖర్జీతో పాటుగా ఎస్ఎస్ రాజమౌళి మంగళవారం వైజాగ్ లో సందడి చేశారు.
ఈ సందర్భంగా 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ లాంచ్ తేదీని వెల్లడించడానికి మేకర్స్ ఒక గ్లింప్స్ ని ఆవిష్కరించారు. 35 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో విజువల్స్ నిజంగా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు రణబీర్ - అలియా లుక్ లను మాత్రమే రిలీజ్ చేయగా.. ఈ గ్లింప్స్ లో అమితాబ్ - నాగార్జున మరియు మౌని రాయ్ వంటి ఇతర ప్రధాన తారాగణాన్ని చూపించారు.
నాగ్ ఇందులో సరికొత్త లుక్ లో ఇంటెన్స్ గా కనిపించారు. అతని కళ్ళలో స్పార్క్స్ రావడాన్ని బట్టి చూస్తే అతీంద్రియ శక్తులు కలిగివున్న పాత్రను నాగార్జున పోషిస్తున్నారని తెలుస్తుంది. 2003 తర్వాత హిందీ సినిమాలకు దూరంగా ఉన్న కింగ్.. ఇప్పుడు 'బ్రహ్మాస్త్ర' సినిమాలో ఇంతకుముందెన్నడు నటించని రోల్ తో రీ ఎంట్రీ ఇస్తున్నారని అర్థం అవుతుంది.
ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ ప్రమాణాలతో సమానంగా ఉండబోతున్నాయని ట్రైలర్ గ్లింప్స్ ని బట్టి చెప్పవచ్చు. 'ఇక ఆట మొదలు..' అనే వాయిస్ ఓవర్ తో ఈ వీడియోని ముగించారు. ఇది ట్రైలర్ మీద ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. అందరూ వేచి చేస్తున్న 'బ్రహ్మాస్త్రం' పార్ట్-1 ట్రైలర్ ను జూన్ 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇకపోతే 'బ్రహ్మాస్త్ర' సినిమాలో డీజే శివ పాత్రలో నటిస్తున్నానని రణబీర్ తెలిపారు. ఇందులో తనకు నిప్పుతో విచిత్రమైన అనుబంధం ఉంటుందని పేర్కొన్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రీతమ్ సంగీతం సమకూర్చారు.
పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటుగా తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో 'బ్రహ్మాస్త్ర' సినిమా రిలీజ్ కానుంది. సౌత్ ఇండియాలో ఎస్ఎస్ రాజమౌళి ఈ మాగ్నమ్ ఓపస్ కు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్నారు.