Begin typing your search above and press return to search.

#ధైర్య‌స్య‌.. వ్యాక్సినేష‌న్ తోనే బాక్సాఫీస్ లింకు..!?

By:  Tupaki Desk   |   3 May 2021 5:30 PM GMT
#ధైర్య‌స్య‌.. వ్యాక్సినేష‌న్ తోనే బాక్సాఫీస్ లింకు..!?
X
క‌రోనా మొద‌టి వేవ్ స‌మ‌యంలో అంతా క‌న్ఫ్యూజ‌న్. మ‌హ‌మ్మారీ వెంట‌నే వెళ్లిపోతుంద‌ని భావించారు. కానీ అది ఐదారు నెల‌ల పాటు తీవ్ర రూపానికి చేరింది. ఆ త‌ర్వాత కొంత రిలీఫ్ క‌నిపించ‌గానే జ‌నం ఆరుబ‌య‌ట స్వేచ్ఛ‌ను దుర్వినియోగం చేశారు. దాని ఫ‌లితం సెకండ్ వేవ్. ఈసారి నాలుగు నెల‌ల పాటు ఈ ఉధృతి కొన‌సాగుతుంద‌ని అంచ‌నా వేసారు. ఇప్ప‌టికే చాలా ప‌రిశ్ర‌మ‌ల్లానే వినోద‌రంగంపైనా సెకండ్ వేవ్ ప్ర‌భావం ప‌డింది.

థియేట‌ర్ల‌లో రిలీజ్ కావాల్సిన సినిమాలు రిలీజ్ కాలేదు. ఏప్రిల్ - మే నెల‌లో ఏవీ రిలీజ్ చేయ‌డం లేదు. క‌నీసం జూన్ నాటికి ఏదైనా క్లారిటీ వ‌స్తుందా? అన్న‌ది చూస్తే దానికి ఇంకా సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జూన్ రెండోవారానికి కొంత వర‌కూ తిరిగి కంట్రోల్ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. మొద‌టి వేవ్ లానే ఈసారి కూడా.. కాక‌పోతే ఈసారి మ‌ర‌ణాల శాతం పెరిగింది.

అన్నిటినీ టాలీవుడ్ భేరీజు వేసుకుని ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తుంది. ల‌వ్ స్టోరి- ట‌క్ జ‌గ‌దీష్- విరాఠ‌ప‌ర్వం- త‌లైవి- పాగ‌ల్ ఇవ‌న్నీ ఇప్ప‌టికే వాయిదా ప‌డ్డాయి. ఆచార్య‌.. ఆగ‌స్టుకు వాయిదా ప‌డింది. జూన్ నాటికి అయినా క్లారిటీ వ‌స్తే త‌దుప‌రి రిలీజ్ తేదీల గురించి ఆలోచిస్తారు. చ‌క‌చ‌కా సినిమాలు మునుప‌టిలా రిలీజై స‌క్సెస‌వుతాయ‌నే ఆశిస్తున్నారు. ప్ర‌స్తుతానికి జూన్ మిడిల్ వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అప్ప‌టికి వ్యాక్సినేష‌న్ రెండో డోస్ ప్ర‌క్రియ‌తో చాలా వ‌ర‌కూ మేలు జరుగుతుంది. మొద‌టి డోస్ మూడో బంచ్ కూడా పూర్త‌వుతోంది. ప్ర‌తిదీ వ్యాక్సినేష‌న్ తో ముడిప‌డిన‌ది కాబ‌ట్టి ప్ర‌స్తుతానికి స‌హ‌నం అవ‌స‌రం. ప్రోటోకాల్ పాటించి ప్ర‌జ‌లు సుర‌క్షితంగా ఉంటేనే అన్ని రంగాల‌కు క్షేమ‌క‌రం.. ముఖ్యంగా వినోద‌రంగానికి మంచి రోజులు రావాల‌ని ఆకాంక్షిద్దాం.