Begin typing your search above and press return to search.
'బ్రేక్ అవుట్' ట్రైలర్: సర్వైవల్ థ్రిల్లర్ తో వచ్చిన బ్రహ్మానందం తనయుడు..!
By: Tupaki Desk | 29 Aug 2022 11:37 AM GMTలెజండరీ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ''బ్రేక్ అవుట్''. విభిన్నమైన కాన్సెప్టుతో సర్వైవల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాతో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అందరిలో ఆసక్తిని కలిగించింది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసి టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
'బ్రేక్ అవుట్' సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. సినిమా కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టీమ్ ఇలాంటి కథలతో ప్రయోగాలు చేయడం విశేషం. రాజా గౌతమ్ - దర్శకుడు సుబ్బు మరియు మొత్తం తారాగణం, సిబ్బందికి నా శుభాకాంక్షలు అని బన్నీ ట్వీట్ లో పేర్కొన్నారు.
ట్రైలర్ విషయానికొస్తే.. ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా సాగింది. మోనోఫోబియాతో బాధపడే ఓ వ్యక్తి.. అనుకోని పరిస్థితుల్లో నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఓ ఇంట్లో చిక్కుకొని ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? అక్కడి నుంచి బయటపడటానికి ఏం చేశాడు? అనేది ఇందులో చూపించారు.
ఒంటరిగా ఉండాలంటే భయపడే వ్యక్తిగా రాజా గౌతమ్ ఆకట్టుకున్నాడు. అతన్ని వెంటాడుతున్న భయం జీవితంలో ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టింది? దాన్ని అతను ఎలా అధిగమించాడు? ఒక ప్రమాదం అతని జీవితాన్ని ఎలా మార్చింది? అనేది ఈ సినిమాలో థ్రిల్లింగ్ గా చెప్పబోతున్నారు.
కేవలం రాజా గౌతమ్ పాత్రతోనే ఇంట్రెస్టింగ్ గా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఇది హిందీలో 'ట్రాప్డ్' వంటి పలు చిత్రాలను గుర్తు చేస్తుంది. దీనికి విజువల్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. జోన్స్ రూపర్ట్ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేయగా.. మోహన్ చారీ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
అనిల్ మోదుగ ఫిలిమ్స్ బ్యానర్ పై అనిల్ మోదుగ ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణ కోడూరి మరియు శ్రీనివాస్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాలో కిరీటి - బాల కామేశ్వరి - ఆనంద చక్రపాణి - జి బాల - రమణ భార్గవ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
'పల్లకిలో పెళ్లికూతురుతో' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన గౌతమ్.. హీరోగా నిలదొక్కుకోడానికి చాలా ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు. విభిన్నమైన కథలతో మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. బసంతి - మను లాంటి సినిమాలు అతనికి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ''బ్రేక్ అవుట్'' సినిమా గౌతమ్ కు సరికొత్త ఇమేజ్ తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. త్వరలోనే విడుదల కానున్న ఈ మూవీ బ్రహ్మానందం కుమారుడికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.