Begin typing your search above and press return to search.
నేచురల్ స్టార్ వేగానికి బ్రేక్..చేతిలో 'దసరా' మాత్రమేనా!
By: Tupaki Desk | 16 July 2022 12:30 PM GMTనేచురల్ స్టార్ నాని వేగానికి బ్రేక్ పడింది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్ని లైన్ లో పెట్టే నాని లో ఇప్పుడా వేగం కనిపించలేదు. ఒక సినిమా సెట్ లో ఉంగానే రెండు...మూడు ప్రాజెక్ట్ ల ప్రకటనతో ముందుండే? నానిలో ఇప్పుడు ఆ ఊసే కనిపించలేదు. ప్రస్తుతం నాని కొత్త మేకర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'దసరా'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
తెలంగాణ దసరా నేపథ్యంలో సాగే స్టోరీ ఇది. పక్కా మాస్ ఎంటర్ టైనర్. ఇప్పటికే నాని రగ్గడ్ లుక్ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చింది. సినిమాపై మంచి అంచనాలే కూడా ఉన్నాయి. చిత్రీకరణ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. మరి 'దసరా' తర్వాత నాని కమిమెంట్ల సంగతేంటి? అంటే ఎలాంటి చడిచప్పుడు కనిపంచడం లేదు.
ఇప్పటివకూ మరో కొత్త సినిమా కమిట్ అయినట్లు లేదు. మరి ఈ బ్రేక్ కి కారణం ఏంటి? అంటే వైఫల్యాలే? గురించి విశ్లేషించాలేమో. నాని కి సరైన కమర్శియల్ హిట్ పడి ఐదేళ్లు అవుతుంది. 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' తర్వాత కమర్శియల్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకున్న చిత్రం లేదు. 'ఎంసీఏ' తర్వాత నటించిన 'కృష్ణార్జున యుద్దం' అంచనాలు అందుకోలేదు.
అటుపై నటించిన 'దేవదాస్'..'గ్యాంగ్ లీడర్'..'టక్ జగదీష్' అన్ని పరాజయాల అంచునే ఉన్నాయి. 'జెర్సీ' కి మంచి టాక్ వచ్చినా భారీ లాభాలు తీసుకురాలేదు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గానే రాణించింది. కానీ నటుడిగా నాని గ్రాఫ్ ని పెంచిన చిత్రమది. నేచురల్ స్టార్ కెరీర్ లోనే గుర్తిండిపోయే సినిమా అది.
గతేడాది ముగింపులో 'శ్యాం సింఘరాయ్' తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇది డిఫరెంట్ జానర్ సినిమా. నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద జోరు చూపించలేదు. ఇటీవలే 'అంటే సుందరానికీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ సుందరం కూడా బాక్సాఫీస్ వద్ద ప్రతాపం చూపలేకపోయాడు.
మరి ఈ కారణాలుగానే నాని వేగానికి బ్రేక్ పడిందా? అంటే అవుననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఫల్యాలు మార్కెట్ లో ప్రభావాన్ని చూపిస్తున్నట్లే కనిపిస్తుంది తాజా సన్నివేశాన్ని బట్టి. మరి ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే? 'దసరా'తో మోత మోగించాల్సిందే మరి.