Begin typing your search above and press return to search.
బ్రేకప్ జోడీ పదేళ్లకు తిరిగి మీటింగ్
By: Tupaki Desk | 24 March 2019 4:14 AM GMTఒక అందమైన అమ్మాయి .. అబ్బాయి కెరీర్ జర్నీలో కలిశారు. అటుపై స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. ఆ ప్రేమ పీక్స్ కు చేరుకుంది. ఒకరినొకరు వీడి ఉండలేనంత డీప్ గా వెళ్లిపోయారు. కట్ చేస్తే ఆ అమ్మాయితో ఆ అబ్బాయికి బ్రేకప్ అయ్యింది. ఇదేదో తెలుగు సినిమా స్టోరీలా ఉందే అని ఆశ్చర్యపోనవసరం లేదు. తెలుగు సినిమా పరిశ్రమలో జరిగిన లవ్ స్టోరి ఇది. ఆ ఇద్దరూ టాలీవుడ్ లో పాపులర్ స్టార్లు కావడం ఆసక్తికరం. ప్రేమలు పుట్టేది సామాన్య జనాలకేనా? స్టార్లకు పుట్టకూడదా? అలానే ఆ జోడీ కలిసి రెండు సినిమాల్లో నటించిన క్రమంలో స్నేహంతో పాటు ప్రేమ తప్పలేదు. అయితే ఈ బ్రేకప్ అన్నదే ఊహించనిది. ఆ తర్వాత ఎవరికి వారు విడిపోయారు. కెరీర్ పరంగా ముందుకెళ్లిపోయారు.
ఆసక్తికరంగా సదరు అగ్ర కథానాయిక.. తిరిగి పదేళ్లకు సదరు హీరోతో కలిసి నటించబోతోందట. మళ్లీ ఇన్నాళ్టికి సెట్స్ లో కలుస్తున్నారని ఇప్పటికే చెవులు కొరికేసుకుంటున్నారు జనం. పదేళ్లు ఆ జంట డీప్ లవ్ లో ఉన్నారని ప్రచారం సాగాక విడిపోయారు. మళ్లీ ఇప్పుడు కలిస్తే ఆ ఇద్దరి మధ్యా టెర్మ్స్ ఎలా ఉంటాయో ఏంటో.. ప్చ్!! అంటూ వేడెక్కించే డిస్కషన్ రన్ అవుతోంది.
పైగా ఆ ఇద్దరూ తిరిగి కలిసే సినిమా అద్భుతమైన ప్రేమకథా చిత్రం. అందులో ఓ ముంబై బొమ్మ కథానాయికగా నటిస్తోంది. అన్ని ప్రేమకథలు ఒకేలా ఉండవు అన్న తీరుగా నవతరం దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. 2020 సంక్రాంతికి రిలీజవుతుందన్న ప్రచారం ఉంది. ఇకపోతే ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్టిచ్చే కీలక పాత్రకు సదరు హీరోగారి ఎక్స్ గాళ్ ఫ్రెండ్ ని ఎంపిక చేయడం వెనక మతలబు ఏంటి? అన్నది సదరు హీరో గారు కానీ, దర్శకుడు కానీ చెప్పాల్సి ఉంటుంది.