Begin typing your search above and press return to search.
అమ్మాయిల పేర్లతో ఏడుపు పాటలేనా!
By: Tupaki Desk | 7 Jun 2016 5:30 AM GMTహీరో - హీరోయిన్ల కేరక్టర్ల పేర్లతో పాటలు ఉండడం పెద్ద కొత్త విషయమేమీ కాదు. సాధారణంగా ఇలాంటి పాటలు హీరో పేరుతో అయితే.. హీరోయిజం ఎలివేట్ చేసేలా పెడతారు. అదే హీరోయిన్ ని అయితే టీజింగ్ సాంగ్స్ కు వాడుకోవడం మన టాలీవుడ్ స్పెషాలిటీ. ఇది లాస్టియర్ వరకూ కల్చర్ ఇదే కానీ.. ఈ ఏడాది మాత్రం ఎందుకో అమ్మాయిల పేర్లు ఏడుపు పాటలకే సెట్ అవుతున్నాయి.
2016 న్యూ ఇయర్ రోజున రిలీజ్ అయిన ఎనర్జిటిక్ హీరో రామ్ మూవీ నేను..శైలజ. ఇందులో 'శైలజా శైలజా' అంటూ సాగే సాంగ్ ఉంటుంది. హీరోయిన్ తో బ్రేకప్ నేపథ్యంలో ఈ పాట వస్తుంది. దాదాపుగా హీరో ఏడుపుగొట్టు సిట్యుయేషన్ లో ఏడవలేక పాట పాడుకుంటాడన్న మాట. ఇప్పుడు అ..ఆ.. మూవీలోను ఇదే పరిస్థితి. హీరోయిన్ సమంతను ప్రేమించలేనని హీరో నితిన్ చెప్పిన తర్వాత ఓ పాట వస్తుంది. అయితే.. హీరోతో కాకుండా.. పక్కనే ఉన్న కమెడియన్ కి ఓ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అంటూ సాంగ్ మొదలెడతారు.
శ్యామలా... శ్యామలా అంటూ ఈ పాట సాగుతుంది. ప్రవీణ్ ఏడ్చుకుంటూ ఉంటే.. నితిన్ డ్యాన్సులేసుకుంటూ సమంతతో తన బ్రేకప్ గురించి చెప్పే పాట ఇది. అమ్మాయిల పేర్లు ఇలా బ్రేకప్ సాంగ్స్ కి, ఏడ్చుకోవడానికే పరిమితం చేసేయడం ఆలోచించాల్సిన విషయం కదూ.