Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: 'రాధేశ్యామ్' వాయిదా.. మళ్ళీ రిలీజ్ ఎప్పుడంటే..?
By: Tupaki Desk | 5 Jan 2022 7:03 AM GMTదేశవ్యాప్తంగా కరోనా మరియు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆందోళనకర పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. గత రెండేళ్లలో ఎదుర్కొన్న సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. దీంతో పాన్ ఇండియా సినిమాల విడుదలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే 'ఆర్.ఆర్.ఆర్' మూవీ వాయిదా పడగా.. ఇప్పుడు 'రాధేశ్యామ్' కూడా అదే దారిలో పోస్టుపోన్ అయింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధా కృష్ణకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ''రాధే శ్యామ్''. సంక్రాంతి కానుకగా జనవరి 14న భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా వార్తలను ఖండించిన మేకర్స్.. ఇప్పుడు సినిమాల రిలీజులకు పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో ప్రభాస్ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
‘‘రాధే శ్యామ్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చేందుకు గడిచిన కొన్నిరోజుల నుంచి మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం. కానీ ఒమిక్రాన్ మరియు కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల రీత్యా చిత్రాన్ని వాయిదా వేయాల్సి వస్తోంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి మీ ముందుకు వస్తాం’’ అని చిత్ర బృందం ప్రకటనలో పేర్కొంది. మీ ప్రేమ, మద్దతుకు అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు.
ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ పెట్టడంతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రదర్శించాలని ఆంక్షలు విధించారు. కేరళ - తమిళనాడు -
మహారాష్ట్ర - కర్ణాటక లలో ఈ విధంగానే సినిమాలు నడుస్తున్నాయి. ఇక బీహార్ - పశ్చిమ బెంగాల్ - న్యూఢిల్లీ రాష్ట్రాలు థియేటర్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాళ్లను మూసివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ప్రాణాలను రిస్క్ లో పెట్టి సినిమాలు చూడటానికి జనాలు థియేటర్లకు రాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలను విడుదల చేయడం అంటే కోరి నష్టాలను కొని తెచ్చుకున్నట్లే అని 'రాధే శ్యామ్' మేకర్స్ వాయిదా నిర్ణయానికి వచ్చారు. అయితే 'రాధే శ్యామ్' ను సంక్రాంతి రేసు నుంచి తప్పించి.. పరిస్థితులు సానుకూలంగా ఉంటే మార్చి 18న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని టాక్ నడుస్తోంది.
ఇప్పటికే పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని వాయిదా వేసిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు టాక్. అలానే ఇప్పుడు 'రాధే శ్యామ్' కూడా అదే సమయంలో వస్తుందని అంటున్నారు. ఇదే జరిగితే సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న రెండు భారీ సినిమాలు సమ్మర్ లో అలరిస్తాయని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.
కాగా, 'రాధే శ్యామ్' చిత్రాన్ని యూరప్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వంశీ - ప్రమోద్ మరియు ప్రసీద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హిందీలో టీ సిరీస్ భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దక్షిణాదిలో ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరణ్.. హిందీ వెర్షన్ కు మిథున్ స్వరాలు సమకూర్చారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. రవీందర్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేసారు.