Begin typing your search above and press return to search.

జేమ్స్ బాండ్ మీద జోకులు పేలుతున్నాయ్

By:  Tupaki Desk   |   28 Jun 2016 4:08 AM GMT
జేమ్స్ బాండ్ మీద జోకులు పేలుతున్నాయ్
X
జేమ్స్ బాండ్.. 007.. ప్రపంచవ్యాప్తంగా చాలానే సినిమాలు వస్తాయి కానీ.. దశాబ్దాల పాటు ఒక పాత్ర-ఒక సిరీస్ కంటిన్యూ అవడం ఎవరికీ సాధ్యం కాదు. ఒక్క జేమ్స్ బాండ్ కి తప్ప. అంతగా సినీ ప్రేక్షకులను కట్టి పడేసిన ఈ జేమ్స్ బాండ్ కి ఇప్పుడు కష్టాలు మొదలవుతున్నాయి.. అంటున్నారు ఫ్యాన్స్.

జేమ్స్ బాండ్ అంటే బ్రిటిష్ హీరో అనే విషయం తెలిసిందే. సూపర్ హీరో పాత్రే అయినా అద్భుత శక్తులు ఏమీ ఉండవు. మనలాగే ఉంటూ విపరీతమైన తెలివితేటలు - పరికరాలు - సాధనాలు వాడేస్తుంటాడు. ఇన్ని చేసేందుకు యూరోప్ దేశాలన్నీ చుట్టేస్తుంటాడు జేమ్స్ బాండ్. అయితే ఇప్పుడిలా యూరోప్ అంతా తిరిగేందుకు వీలు లేదు. కారణం #బ్రెగ్జిట్. బ్రిటన్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయింది. అంటే ఆ దేశవాసులు యూరోప్ లోని ఏ దేశానికి వెళ్లాలన్నా వీసా తప్పనిసరి.

మరి జేమ్స్ బాండ్ ఇప్పుడు లండన్ నుంచి పారిస్ - రోమ్ వంటి ప్రాంతాలకు అంత ఈజీగా వెళ్లిపోలేడు. ఖచ్చితంగా వీసా వగైరాలు కావాల్సిందే. ఐటెంటిటీని దాచిపెట్టేసి ప్రయాణించేస్తానంటే ఇకపై కుదరదు కదా. అంటే ఏ దేశానికి వెళ్లాలన్నా క్యూలో నుంచుని వీసా తెచ్చుకోక తప్పదు.. అంటూ బ్రెగ్జిట్‌ గురించి ప్రస్తావిస్తూ అభిమానులు జోకులు వేసుకుంటున్నారు