Begin typing your search above and press return to search.
మొదటి బంతికే లారాను బౌల్డ్ చేశా:ప‌్రశాంత్ వర్మ
By: Tupaki Desk | 11 March 2018 4:50 AM GMTడాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారట.....అనేది సినీరంగంలో ఓ పాపులర్ నానుడి. అయితే, ఓ యువ దర్శకుడు క్రికెటర్ కాబోయి...డైరెక్టర్ అయ్యాడట. `అ!`వంటి విలక్షణ సినిమాను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ప్రశాంత్ వర్మకు క్రికెట్ అంటే పిచ్చి అట. అయితే, అదే సమయంలో సినిమాలపై కూడా ఆసక్తి పెరగడంతో క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడట. ఒక మ్యాచ్ ఆడే సమయంలో 5 సినిమాలు చూసేందుకు వీలుండడంతో పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టాడట. తన దగ్గర ఉన్న కాన్సెప్ట్ లతో షార్ట్ ఫిల్మ్స్ రూపొందించిన ప్రశాంత్ కు బ్రేక్ రావడానికి చాలా కాలం పట్టింది. అయితే, ఓ రోజు తన షార్ట్ ఫిల్మ్ ను మెచ్చుకుంటూ......అనూహ్యంగా వెస్టిండీస్ లెజెండరీ బ్యాట్స్ మన్ బ్రియాన్ లారా నుంచి ప్రశాంత్ కు ఫోన్ వచ్చిందట. అంతేకాదు, తన పై ఓ షార్ట్ ఫిల్మ్ తీయాల్సిందిగా లారా కోరడంతో ప్రశాంత్ ఎగిరి గంతేసి కరేబియన్ కు వెళ్లాడట. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రశాంత్ అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
తన షార్ట్‌ఫిల్మ్ చూశానని, చాలా బాగుందని లారా పొగుడుతుంటే షాక్ అయ్యానని, దానినుంచి తేరకోవడానికే చాలా టైం పట్టిందని ప్రశాంత్ అన్నాడు. ఆయనకు థ్యాంక్స్ చెప్పడానికి మాటలు తడబడుతున్న సమయంలోనే ....ఆయన మరో షాక్ ఇచ్చారని ప్రశాంత్ అన్నాడు. తనమీద ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేయమని ఆయన అడిగేసరికి ఆశ్చర్యం...ఆనందం రెండూ కలిగాయని ప్రశాంత్ అన్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫ్లైట్ ఎక్కేశాననని, ఆ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ కూడా ఫ్లైట్‌లోనే రాశానని తెలిపాడు. ‘నాట్ అవుట్’ పేరుతో లారా మీద ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశానని - అది తన జీవితంలో మరచిపోలేని ప్రయాణమని చెప్పాడు. షూటింగ్ సమయంలో సరదాగా లారాతో క్రికెట్ ఆడానని - లారాను మొదటి బంతికే బౌల్డ్ చేశానని అన్నాడు. లారాని అవుట్ చేసిన వీడియో - తాను బెస్ట్ డైరెక్టర్ అంటూ లారా స్వయంగా రాసి బహుమతిగా ఇచ్చిన బ్యాట్... తన తండ్రికి కానుకగా ఇచ్చానని చెప్పాడు.