Begin typing your search above and press return to search.

బాబోయ్‌.. పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను 100 కోట్లకు అమ్మేశారు

By:  Tupaki Desk   |   7 Dec 2021 8:36 AM GMT
బాబోయ్‌.. పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను 100 కోట్లకు అమ్మేశారు
X
బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కత్రీనా కైఫ్ మరియు స్టార్‌ హీరో విక్కీ కౌశల్ ల వివాహంకు సంబంధించిన అన్ని విషయాలు కూడా చాలా రహస్యంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పెళ్లికి సంబంధించిన ఎలాంటి అప్డేట్‌ ఫొటో రూపం లో రాలేదు. ముందుగానే పెళ్లికి హాజరు అయ్యే వారికి కండీషన్స్ పెట్టి ఎలాంటి ఫొటోలు మరియు వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయవద్దంటూ నివారించారట. పెళ్లి మండపం మొదలుకుని పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు ఏ ఒక్కరిని కూడా సెల్‌ ఫోన్ లో కాని ప్రైవేట్‌ వ్యక్తులు కెమెరాల్లో కాని షూట్ చేయడానికి అస్సలు వీలు లేదు. ఎలాంటి పిక్స్ కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్న నేపథ్యంలో ఇంత సీక్రెట్‌ ఎందుకు అని అంతా అనుకున్నారు.

ఇప్పుడు అసలు విషయం వెలుగు లోకి వచ్చింది. బాలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ పెళ్లికి సంబంధించిన స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ కి ఈ కొత్త దంపతులు కట్టబెట్టినట్లుగా తెలుస్తోంది. ఆ స్ట్రీమింగ్‌ హక్కుల విలువ ఏకంగా 100 కోట్లు ఉందని అంటున్నారు. వంద కోట్ల కు పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్క తంతు ను ఆ సంస్థ క్యాప్చర్ చేసుకుని స్ట్రీమింగ్‌ చేయబోతుంది. ఇది ఇండస్ట్రీలో కొత్త తంతు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. పెళ్లి వేడుకను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ఈ జంట ఇలా పెళ్లి వేడుక వీడియో ఫుటేజ్ ను అమ్మేసుకోవడం ను కొందరు తప్పుబడుతుంటే వారి బిజినెస్ మైండ్‌ కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

రాజస్థాన్ లోని ఒక చిన్న టౌన్ లో అత్యాదునిక హంగులతో కూడిన ఫైవ్‌ స్టార్ హోటల్ లో ఈ వివాహ వేడుక జరుగుతోంది. అత్యంత ఖరీదైన ఈ పెళ్లి వేడుకలో 200 నుండి 250 మంది అతిథులు హాజరు అవ్వబోతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరి గా ధరించాలని జిల్లా అధికారులు తెలియజేశారు. అంతే కాకుండా ప్రతి ఒక్క గెస్ట్‌ కూడా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలి. వ్యాక్సినేషన్ కాని వారు మాత్రం వారికి సంబంధించిన కరోనా టెస్ట్‌ ను చూపించాలని అధికారులు ఆదేశించారు. మొత్తానికి పెళ్లి వేడుక హడావుడి మరియు సందడి మీడియాలో కనిపించక పోవడం అభిమానులకు నిరుత్సాహం కలిగిస్తుంది. సదరు ఓటీటీ వారు ఆ ఫుటేజ్ ను ఎప్పుడు స్ట్రీమింగ్‌ చేస్తారు అనేది చూడాలి.