Begin typing your search above and press return to search.

ఆర్‌.ఆర్‌.ఆర్ గురించి న‌యా క‌బురు

By:  Tupaki Desk   |   17 July 2018 5:11 PM GMT
ఆర్‌.ఆర్‌.ఆర్ గురించి న‌యా క‌బురు
X
రాజ‌మౌళి త‌న త‌దుప‌రి సినిమా `ఆర్‌.ఆర్‌.ఆర్‌`ని పీరియాడిక‌ల్ క‌థ‌తో తెర‌కెక్కిస్తున్నార‌నేది ఎప్ప‌ట్నంచో వినిపిస్తున్న విష‌యం. అయితే పీరియాడిక‌ల్ అంటే రంగ‌స్థ‌లంలాగా సెవెన్టీస్‌ - ఎయిటీస్‌ లో ఉండొచ్చ‌నుకొన్నారంతా. కొద్దిమంద‌యితే ప‌క్కాగా ఎయిటీస్ క‌థ అన్నారు. కానీ లేటెస్ట్ స‌మాచారం ఏంటంటే అది స్వాతంత్ర్యం కాలంనాటి క‌థ అట‌. అంటే బ్రిటిష్ పాల‌న కొన‌సాగుతున్న ఫార్టీస్ నేప‌థ్యంలో సాగుతుంద‌ట‌. అందుకోసం అప్ప‌టి వాతావ‌ర‌ణం ప‌క్కాగా ప్ర‌తిబింబించేలా ఎలాంటి క‌స‌ర‌త్తులు చేయాలో అందుకు త‌గ్గ ఏర్పాట్లు మొద‌లుపెట్టార‌ట రాజ‌మౌళి. అప్ప‌టి వాహ‌నాలు ఎలా ఉండేవో... అప్ప‌టి నిర్మాణాలు ఎలా ఉండేవో ప‌క్కాగా స్కెచ్‌ లు వేయించి అందుకు త‌గ్గ క‌స‌ర‌త్తులు చేయిస్తున్నట్టు తెలుస్తోంది.

రాజ‌మౌళి ఒక సినిమా చేశాడంటే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పెద్ద‌యెత్తున జ‌రుగుతాయి. స్కెచ్చుల‌తోనూ - యానిమేష‌న్ బొమ్మ‌ల‌తోనూ దాదాపుగా సినిమాని తీసి - ముందే చూసుకుంటారు. ఇప్పుడు ఆర్‌.ఆర్‌.ఆర్ విష‌యంలోనూ అదే జ‌రుగుతోంద‌ట‌. అలాగే ఎన్టీఆర్‌ - రామ్‌ చ‌ర‌ణ్‌ లపై వ‌చ్చే స‌న్నివేశాల‌పై ఆయ‌న మ‌రింత జాగ్ర‌త్త తీసుకుంటున్నాడ‌ని తెలిసింది. భారీ వ్య‌యంతో రూపొందే ఈ చిత్రం కోసం కూడా పెద్ద‌యెత్తునే సెట్లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని తెలిసింది. అయితే అస‌లు ఈ సినిమా క‌థా నేప‌థ్యం ఏంటి? ఎలా ఉండ‌బోతోంద‌న్న‌ది రాజ‌మౌళి సినిమాని ప్ర‌క‌టించిన రోజే అస‌లు సంగ‌తి వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.