Begin typing your search above and press return to search.
ట్రైలర్ : సూపర్ స్టార్ తో అప్పుడు పుల్ సీరియస్ ఇప్పుడు ఫుల్ కామెడీ
By: Tupaki Desk | 7 Jan 2022 7:30 AM GMTమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు వీరాభిమానిగా.. ఆప్తుడిగా.. అత్యంత ఇష్టమైన వ్యక్తిగా చెప్పుకునే మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూనే మరో వైపు దర్శకత్వం కూడా చేస్తున్నాడు. ఇప్పటికే సూపర్ స్టార్ మోహన్ లాల్ తో పృథ్వీ రాజ్ 'లూసీఫర్' అనే పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాను తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఆ సినిమా లో మోహన్ లాల్ ను ఎంత సీరియస్ గా పృథ్వీ రాజ్ చూపించాడో అందరికి తెల్సిందే. పృథ్వీ రాజ్ ఆ సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆ లూసీఫర్ ను తెలుగు తో పాటు పలు భాషల్లో రీమేక్ చేసేందుకు సిద్దం అవుతున్నారు అంటే ఆ సినిమా యొక్క విజయాన్ని అర్థం చేసుకోవచ్చు. తనకు ఇష్టమైన మోహన్ లాల్ ను ఎలా చూడాలి అని జనాలు అనుకుంటున్నారో అలా ఆయన్ను చూపించాలని పృథ్వీ రాజ్ భావిస్తున్నాడు. అందుకే మొదటి సినిమాగా లూసీఫర్ తీశాడు. తాజాగా బ్రో డాడీ సినిమా ను మోహన్ లాల్ తో పృథ్వీ రాజ్ తెరకెక్కించాడు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మోహన్ లాల్ ను లూసీఫర్ లో ఎంత సీరియస్ గా చూపించాడో బ్రో డాడీ లో అంత జోవియల్ గా అంతకు మించిన జోవియల్ గా చూపించినట్లుగా ట్రైలర్ ను చూస్తుంటే అర్థం అవుతోంది. సినిమా లో మోహన్ లాల్ పాత్ర మాత్రమే జోవియల్ గా సరదాగా ఉండటం కాకుండా మొత్తం సినిమా అంతా కూడా చాలా కామెడీతో నిండి ఉంటుందని ట్రైలర్ ను చూస్తుంటే అర్థం అయ్యింది. సినిమాలోని ప్రతి సన్నివేశంలో కూడా కామెడీ ఉంటుందని మేకర్స్ చెప్పకనే చెప్పారు. ఒక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా బ్రో డాడీ ఉండబోతుంది.
అనుకున్నట్లుగానే మోహన్ లాల్ మరియు పృథ్వీ రాజ్ లు తండ్రి కొడుకులుగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఆ విషయం ఇప్పటికే వార్తలు వచ్చినా కూడా తాజాగా ట్రైలర్ తో మరింత క్లారిటీ వచ్చింది. తండ్రి అయిన మోహన్ లాల్ ఒక తండ్రిలా కాకుండా ఒక యంగ్ కుర్రాడిలా ప్రవర్తిస్తూ కొడుకు అయిన పృథ్వీ రాజ్ కు అన్నింట పోటీ వస్తూ ఉంటాడు. దాంతో ఆయన మీకు అన్నయ్య లేదా తండ్రా అంటూ చాలా మంది సినిమాలో పృథ్వీ రాజ్ పాత్రను అడుగుతారట. అలా సినిమా చాలా సరదాగా సాగుతుందని.. ఈ సరదా ఫ్యామిలీ డ్రామాలో లవ్ స్టోరీ కూడా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇక మోహన్ లాల్ కు మీనా జోడీగా నటించింది. జనవరి 26 నుండి ఈ సినిమా స్త్రీమింగ్ కాబోతుంది.
వీరిద్దరి కాంబో దృశ్యం తో హిట్ పెయిర్ అని నిరూపితం అయ్యింది. అందుకే బ్రో డాడీ కూడా ఒక మంచి ఫ్యామిలీ డ్రామాగా నిలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ సినిమా కనుక అక్కడ సూపర్ హిట్ అయితే ఖచ్చితంగా తెలుగు లో రీమేక్ అయ్యే అవకాశం ఉంది. మరి యంగ్ హీరోకు తండ్రి పాత్రలో నటించేందుకు ఏ సీనియర్ హీరో ఆసక్తి చూపిస్తాడు అనేది చూడాలి. ట్రైలర్ చూస్తుంటే మోహన్ లాల్ పోషించిన పాత్రను వెంకీ పోషిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వెంకీ మరియు చైతూ లేదా రానాలు కలిసి ఈ సినిమాను చేస్తే బాగుంటుంది అనేది కొందరు అభిప్రాయం. మరి వెంకటేష్ ఆసక్తి చూపిస్తాడా లేదా అనేది చూడాలి.