Begin typing your search above and press return to search.
కిడ్నాప్ కామెడీ - టీజర్ టాక్
By: Tupaki Desk | 20 April 2019 6:51 AM GMTమెంటల్ మదిలో ద్వారా పరిచయమైన దర్శకుడు ఆత్రేయ రెండో సినిమా బ్రోచేవారెవవురా టీజర్ ఇందాకా విడుదల చేశారు. ఫస్ట్ మూవీలో నటించిన శ్రీ విష్ణు-నివేత పెతురాజ్ ఇందులో కూడా రిపీట్ అయ్యారు. టీజర్ చిన్నదే అయినా కంటెంట్ ని వీలైనంత చెప్పే ప్రయత్నం చేశారు. ముందు అదేంటో చూద్దాం.
సత్యదేవ్ ఒక ఫిలిం మేకర్. ఓ కథను సిద్ధం చేసుకుని వినిపించేందుకు నివేత పెతురాజ్ ను రెస్టారెంట్ లో కలుస్తాడు. అక్కడ మొదలవుతుంది ఆర్3 బ్యాచ్ స్టొరీ. సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ కాలేజీలో చదువుకునే ముగ్గురు కుర్రాళ్ళు శ్రీవిష్ణు-రాహుల్ రామకృష్ణ-ప్రియదర్శి. వీళ్ళలో శ్రీవిష్ణు ఏకంగా ప్రిన్సిపాల్ కూతురు మిత్ర(నివేదా థామస్)నే లైన్ లో పెడతాడు.
ఇంతలో ఈజీ మనీ కోసం ఈ ముగ్గురు కలిసి ఓ డబ్బున్న వ్యక్తి కూతురిని కిడ్నాప్ చేస్తారు. కట్ చేస్తే ఇటు వైపు సత్యదేవ్ చెప్పిన కథ నచ్చలేదంటూ నివేదా సారీ చెబుతుంది. అసలు ఇదంతా ఏమిటి ఇక్కడ చెప్పిన సినిమా కథ ఈ ముగ్గురిదేనా లేక పారలల్ గా సాగే మరో స్టొరీనా అనేది సస్పెన్స్
టీజర్ లో కొత్తదనం అయితే ఉంది. ముగ్గురు కుర్రాళ్ళ జాలీ లైఫ్ ఓ లవ్ స్టొరీ చిన్న థ్రిల్ ఇచ్చే కిడ్నాప్ డ్రామా ఇదంతా సరదాగా సాగిపోయింది. ఆర్టిస్టులందరూ సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం వివేక్ సాగర్ సంగీతం మూడ్ కి తగ్గట్టు బాగా సింక్ అయ్యాయి. మొత్తానికి ఏదో విభిన్నమైన ప్రయత్నం అనే ఫీలింగ్ అయితే కలిగింది. సినిమా రంగం బ్యాక్ డ్రాప్ లో ఈ మధ్యకాలంలో సినిమా రాలేదు కాబట్టి ఆ రకంగా కూడా కొంత వెరైటీగా కనిపిస్తోంది. మొత్తానికి న్యూ ఏజ్ సినిమాలో ఇంకో కొత్త అటెంప్ట్ గా కనిపిస్తోన్న బ్రోచేవారెవరురా ఈ వేసవిలోనే విడుదల కానుంది