Begin typing your search above and press return to search.

స్పెయిన్ బీచ్ లో గ‌వ్వ‌లు ఏరుతున్న అన్నాచెల్లెళ్లు

By:  Tupaki Desk   |   15 Jan 2021 1:30 PM GMT
స్పెయిన్ బీచ్ లో గ‌వ్వ‌లు ఏరుతున్న అన్నాచెల్లెళ్లు
X
2021లో కొత్త అడుగులు ప‌డుతున్నాయి. ఇప్పుడిప్పుడే వాతావ‌ర‌ణం సానుకూలంగా మారుతోంది. మ‌హ‌మ్మారీ శాంతిస్తోంది. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌తో పాటు సంక్రాంతి సంబ‌రాల్ని ఈసారి మ‌న స్టార్లు ఎంతో వైభ‌వంగా ఇండ్ల‌లోనే జ‌రుపుకుంటున్నారు. మునుప‌టిలా సుదూర తీరాల‌కు వెళ్ల‌కుండా షూటింగుల టెన్ష‌న్ కూడా లేకుండా కాస్తంత కూల్ గానే ఉన్నారు అంతా.

అదంతా స‌రే కానీ.. ప్ర‌తిసారీ సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫ్యామిలీ చాలా ముందే విదేశీ విహార‌యాత్ర‌కు షెడ్యూల్ ని డిజైన్ చేసుకుంటారు. ఈసారి స‌మ్మ‌ర్ వెకేష‌న్ ఎక్క‌డ‌? ఇంత‌కుముందు మ‌హమ్మారీ లాక్ డౌన్ అనంత‌రం దుబాయ్ లో షార్ట్ వెకేష‌న్ ముగించి తిరిగి వ‌చ్చారు. ప్ర‌స్తుతం స‌ర్కార్ వారి పాట షూటింగ్ ప్రిప‌రేష‌న్ తో బిజీగా ఉన్నారు మ‌హేష్‌. మ‌రో నాలుగు నెల‌ల్లో మెజారిటీ షూట్ పూర్తి చేయాల‌న్నది ప్లాన్.

అయితే ఈసారి స‌మ్మ‌ర్ కి మ‌హేష్ ఫ్యామిలీ ట్రిప్ ఎక్క‌డికి ప్లాన్ చేయ‌బోతున్నారు? అంటూ ఫ్యాన్స్ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఈలోగానే అస‌లు విష‌యం సోష‌ల్ మీడియాల్లో లీకైంది. సితార ఘ‌ట్ట‌మ‌నేని స్వ‌యంగా స్పెయిన్ వెకేష‌న్ కి సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోని షేర్ చేయ‌గా అది కాస్తా వైర‌ల్ గా మారింది.

స‌మ్మ‌ర్ వెకేష‌న్ స్పెయిన్ లో.. నా క్రేజీ బ్ర‌ద‌ర్ తో గ‌వ్వ‌లు ఏరుతూ బీచ్ సెల‌బ్రేష‌న్ అంటూ ఆనందంగా ఫోటోని షేర్ చేసింది సితార ఘ‌ట్ట‌మ‌నేని. దీనిని బ‌ట్టి రాబోవు వేస‌వి తాపానికి దూరంగా మ‌రోసారి మ‌హేష్ ఫ్యామిలీ స్పెయిన్ వెకేష‌న్ ప్లాన్ చేస్తోందా? అన్న ఊహాగానాలు సాగుతున్నాయి. యూర‌ప్ దేశాల్లో ఇప్ప‌టికే క‌రోనా అదుపులోకి వచ్చింది. మునుప‌టిలా భ‌య‌ప‌డేంత లేదు. మ‌రోవైపు వ్యాక్సినేష‌న్ ధ‌నిక దేశాల్లో వేగంగా పూర్త‌వుతుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. మ‌రి స్పెయిన్ వెకేష‌న్ కి ఆస్కారం ఉందా లేదా? అన్న‌ది మ‌హేష్ కానీ న‌మ్ర‌త కానీ చెప్పాల్సి ఉంది.