Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: టాలీవుడ్ లో బ్రదర్స్ గేమ్
By: Tupaki Desk | 6 March 2019 1:30 AM GMTడాక్టర్ల కుటుంబంలో డాక్టర్లు.. యాక్టర్ల కుటుంబంలో యాక్టర్లు పుట్టుకు రావడం సహజం. వారసుల రాకను నెప్టోయిజం అంటూ క్వీన్ కంగన లాంటి వాళ్లు కత్తి దూస్తున్నా.. కులవృత్తిని - ఇంట్లో విద్యను వదిలి దూరంగా పోగలరా? బాలీవుడ్ టు టాలీవుడ్ వారసుల ఏలుబడి తప్పనిసరి అన్న సన్నివేశం కనిపిస్తోంది. కేవలం టాలీవుడ్ వరకూ పరిశీలిస్తే.. నటవారసుల్లో బ్రదర్స్ హవా ఏ రేంజులో సాగింది? ఎవరెవరు బ్రదర్స్ తెలుగు సినీపరిశ్రమలో కీలకంగా ఎదిగారు? అన్నది పరిశీలిస్తే ఆసక్తికర సంగతులే తెలిసాయి.
తెలుగు సినిమా హిస్టరీలో `మెగా బ్రదర్స్` గురించి ప్రస్థావించకుండా ఇంకే బ్రదర్స్ ని టచ్ చేయలేరెవరూ. `మెగాబ్రదర్` అన్న పదానికే అంత పవరుంది. మెగాస్టార్ చిరంజీవి- నాగబాబు - పవన్ త్రయం ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి తర్వాత మళ్లీ అంతటి కరిష్మాతో పరిశ్రమను ఏలారు పవన్ కల్యాణ్. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో నిలిచారు. మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా .. నటుడిగా.. టీవీ హోస్ట్ గా బహుముఖ ప్రజ్ఞావంతుడిగా రాజ్యమేలుతున్నారు. ప్రస్తుతం తమ్ముడు పవన్ కి అండగా జనసేన పార్టీని విమర్శించేవాళ్ల పై కౌంటర్ ఎటాక్ తో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అదే తీరుగా నందమూరి బ్రదర్స్ బాలకృష్ణ- హరికృష్ణ బంధం గురించి ఆసక్తికర చర్చ సాగింది. ఆ ఇద్దరూ హీరోలుగా కెరీర్ సాగించారు. హరికృష్ణ నిర్మాతగానూ కొనసాగారు. ఇటీవలే ఓ యాక్సిడెంట్ లో హరికృష్ణ ఆకస్మిక మరణం గురించి తెలిసిందే. అటుపై నందమూరి వారసులుగా ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ జోడీ ఇండస్ట్రీలో ప్రముఖంగా వెలుగులు ప్రసరిస్తున్నారు. అన్నకోసం తమ్ముడు తమ్ముడి కోసం అన్న .. అన్న చందంగా ఇండస్ట్రీలో పాపులరయ్యారు. ఎన్టీఆర్ నిర్మాతగా కళ్యాణ్ రామ్ సినిమా తీసారు. అన్న కోసం తమ్ముడు చేసిన సాయంగానూ దాని గురించి ముచ్చట సాగింది. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ అధినేతగా కళ్యాణ్ రామ్ ని నిలబెట్టుకునేందుకు యంగ్ యమ ఎన్టీఆర్ చేసిన ప్రయత్నం తెలిసిందే. ఇక తమ్ముడు అంటే తనకు ఉన్న అభిమానాన్ని పలు పబ్లిక్ వేదికల సాక్షిగా కళ్యాణ రాముడు ఆవిష్కరించారు. తండ్రి కీ.శే.హరికృష్ణ మరణానంతరం బ్రదర్స్ మధ్య ఎమోషనల్ బాండింగ్ అంతకంతకు బలపడడంపైనా తెలుగు ప్రేక్షకుల్లో - నందమూరి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఘట్టమనేని బ్రదర్స్ లో సూపర్ స్టార్ కృష్ణ- ఆదిశేషగిరిరావు గురించి తెలిసిందే. ఒకరు హీరో ఇంకొకరు నిర్మాత. వీరి వారసులుగా రమేష్ బాబు- మహేష్ తొలి నాళ్లలో కలిసి నటించారు. డాడ్ సూపర్ స్టార్ కృష్ణతో కలిసి మహేష్- రమేష్ బ్రదర్స్ కెరీర్ తొలినాళ్లలో నటించారు. అనంతర కాలంలో రమేష్ బాబు నిర్మాతగానూ కొనసాగారు. గత కొంతకాలంగా రమేష్ బాబు అంత యాక్టివ్ గా లేకపోవడంతో మహేష్ బయటి నిర్మాణ సంస్థల్లో నటిస్తున్నారు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ (ఎంబీ ప్రొడక్షన్స్) స్థాపించి సినిమాలు నిర్మించే స్థాయికి మహేష్ ఎదిగారు. మాస్ మహారాజా రవితేజ- భరత్- రఘు బ్రదర్స్ గురించి తెలిసిందే. అన్న గొప్ప మాస్ స్టార్ గా స్వయంకృషితో ఎదిగారు. ఆ క్రమంలోనే రవితేజ బ్రదర్స్ రఘు - భరత్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినీకెరీర్ ని సాగించడంపై చర్చ సాగింది. ఒక సోదరుడు భరత్ కార్ యాక్సిడెంట్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రఘు నటుడిగా కొనసాగుతున్నారు. అల్లూ బ్రదర్స్ గా అల్లు అర్జున్ - శిరీష్ హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అన్న అల్లు అర్జున్ టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా వెలుగొందుతుంటే - తమ్ముడు శిరీష్ స్టార్ డమ్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే అక్కినేని కాంపౌండ్ లో నాగార్జున వారసులుగా బరిలో దిగారు అక్కినేని నాగచైతన్య- అఖిల్ బ్రదర్స్. అక్కినేని బ్రదర్స్ గా ఆ ఇద్దరూ అభిమానుల్ని సంపాదించుకున్నారు. నాగచైతన్య ఒక్కో సినిమా చేస్తూ కెరీర్ ని మెరుగుపరుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అఖిల్ ఇప్పటికే మూడు సినిమాల్లో నటించి నాలుగో చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. చై- అఖిల్ అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. ఒకరి సినిమాని ఇంకొకరు ప్రమోట్ చేసుకుంటూ - క్రిటిసైజ్ చేసుకుంటూ అనుబంధం చాటుకుంటూనే ఉన్నారు. అలాగే మంచు మోహన్ బాబు వారసులుగా మంచు బ్రదర్స్ విష్ణు- మనోజ్ బ్రదర్స్ గురించి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఇద్దరూ సినిమాలు తగ్గించినా .. అడపాదడపా అభిమానుల ముందుకు వస్తూనే ఉన్నారు. ఆర్యన్ రాజేష్ - అల్లరి నరేష్ బ్రదర్స్ గురించి తెలిసిందే. ఈ ఇద్దరూ ఇంచుమించు ఓకేసారి హీరోలయ్యారు. ఆర్యన్ కెరీర్ పరంగా రేసులో వెనకబడినా - నరేష్ మాత్రం హీరోగా కొనసాగుతున్నారు. సక్సెస్ ముఖం చాటేసిన వేళ ఇటీవల కెరీర్ ని చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు నరేష్. తమిళ హీరోల్లో సూర్య - కార్తీ బ్రదర్స్ గురించి తెలిసిందే. కోలీవుడ్ - టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా తమని తాము ఎలివేట్ చేసుకున్న గట్స్ ఉన్న బ్రదర్స్ గా నిరూపించుకున్నారు. రాజబాబు - చిట్టిబాబు - అలీ - ఖయ్యూం - బాలాదిత్య - కౌశిక్ వంటి బ్రదర్స్ కూడా టాలీవుడ్ లో సుదీర్ఘ కాలం ఆర్టిస్టులుగా కొనసాగుతున్నారు.