Begin typing your search above and press return to search.

బ్రూస్ లీ 50 డేస్.. ఎన్ని సెంటర్లలో?

By:  Tupaki Desk   |   7 Dec 2015 10:30 PM GMT
బ్రూస్ లీ 50 డేస్.. ఎన్ని సెంటర్లలో?
X
ఒకప్పుడు ఓ పెద్ద సినిమా విడుదలైతే.. దాని టాక్ బట్టి అర్ధశతదినోత్సవం ఎన్ని సెంటర్లలో జరుపుకుంటుంది.. వంద రోజుల సెంటర్లు ఎన్ని పడతాయి.. రజతోత్సవం ఎన్ని కేంద్రాల్లో.. అన్న లెక్కల్లోకి వెళ్లిపోయేవాళ్లు జనాలు. ఓ సినిమా విజయాన్ని 50 డేస్, 100 డేస్ సెంటర్లతోనే లెక్కగట్టేవాళ్లు. కానీ ఇప్పుడంతా కలెక్షన్లే ప్రామాణికం అయిపోయాయి. ఎంత పెద్ద సినిమాలైనా కూడా 25 రోజులు ఆడటమే గగనమైపోతోంది ఈ రోజుల్లో. ఇక 50 - 100 రోజుల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఐతే ఈ ఏడాది బాహుబలి - శ్రీమంతుడు సినిమాలు లాంగ్ రన్ తో ఆశ్చర్యపరిచాయి. ఈ రెండూ కూడా వందకు పైగా సెంటర్లలో అర్ధశత దినోత్సవం జరుపుకోవడం విశేషం.

ఈ రెండు సినిమాల తర్వాత టాలీవుడ్ లో అత్యంత భారీ అంచనాలతో విడుదలైన సినిమా ‘బ్రూస్ లీ’. కానీ ఆ అంచనాల్ని అందుకోవడంలో దారుణంగా విపలమైంది. దసరా సీజన్ లో విడుదలైన ఈ సినిమా ఆ అడ్వాంటేజీని కూడా సరిగ్గా వాడుకోలేకపోయింది. బయ్యర్లకు దారుణమైన నష్టాలు మిగిల్చింది. మూడో వారం నుంచే సినిమా థియేటర్ల నుంచి లేచిపోయింది. ఐతే ఇంత నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ‘బ్రూస్ లీ’ మూడు సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. కర్నూలు జిల్లాలోని కర్నూలు సిటీ - ఎమ్మిగనూరు - చిత్తూరు జిల్లా మదనపల్లి సెంటర్లలో బ్రూస్ లీ అర్ధశత దినోత్సవం జరుపుకుంది. ఇది మెగా అభిమానులకు కాస్త ఉపశమనాన్నిచ్చే విషయమే.