Begin typing your search above and press return to search.
‘బ్రూస్ లీ’ పంచాయితీ అక్కడికి చేరింది
By: Tupaki Desk | 28 Oct 2015 10:23 AM GMT‘బ్రూస్ లీ’ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో అతి పెద్ద హిట్టయిన ‘మగధీర’ రికార్డుల్ని బద్దలు కొట్టేస్తుందని అనుకున్నారు విడుదలకు ముందు. కానీ వాస్తవంగా జరిగింది వేరు. చరణ్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ అయిన ‘ఆరెంజ్’ సినిమా రికార్డుల్ని చెరిపేసేలా ఉంది ఆ సినిమా. ‘ఆరెంజ్’ మిగిల్చిన నష్టం గురించి క్లారిటీ లేదు కానీ.. ‘బ్రూస్ లీ’ మాత్రం తక్కువలో తక్కువ రూ.16 కోట్ల దాకా నష్టం మిగిల్చేలా ఉంది పరిస్థితి. తొలి రోజు డివైడ్ టాక్ మొదలైనపుడే ఎంతో కొంత నష్టం తప్పదని బయ్యర్లు సిద్ధపడిపోయారు కానీ.. చివరికి వాళ్లు ఊహించిన దానికంటే భారీగా ఉన్నాయి నష్టాలు.
దీంతో ‘బ్రూస్ లీ’ నిర్మాతను అంత తేలిగ్గా వదలొద్దని ఫిక్సయిన బయ్యర్లందరూ ఒక్కతాటిపైకి వచ్చి.. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గరికి వ్యవహారాన్ని తీసుకెళ్లారట. తమకు న్యాయం చేయాల్సిందే అంటూ పట్టుబడుతున్నారట. దీంతో బ్రూస్ లీ టీంకి - బయ్యర్లకు మధ్య సినీ పెద్దలు పంచాయితీ చేస్తున్నట్లు తెలుస్తోంది. చరణ్ తర్వాతి సినిమాను కూడా డీవీవీ దానయ్యే నిర్మించనున్న నేపథ్యంలో ఈ నష్టాల్ని అప్పుడు కవర్ చేస్తామని హామీ ఇస్తున్నప్పటికీ.. బయ్యర్లు రాతపూర్వకంగా హామీ కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పంచాయితీ ఒక పట్టాన తేలట్లేదు. చివరికి ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుందో చూడాలి.