Begin typing your search above and press return to search.

మగధీర కాదు కదా.. ఎవడు కూడా కష్టమే

By:  Tupaki Desk   |   19 Oct 2015 10:20 AM GMT
మగధీర కాదు కదా.. ఎవడు కూడా కష్టమే
X
రామ్ చరణ్-శ్రీను వైట్లల క్రేజీ కాంబినేషన్.. చాలదన్నట్లు కోన వెంకట్ హ్యాండ్.. పైగా మెగాస్టార్ చిరంజీవి క్యామియో రోల్.. ఇంకేముంది రికార్డుల మోతే.. రామ్ చరణ్ సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్ కావడం ఖాయం.. ‘మగధీర’ రికార్డులు బద్దలు కావడం లాంఛనమే అని మెగా అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ‘మగధీర’ కాదు కదా.. దాని తర్వాతి స్థానంలో ఉన్న చరణ్ సినిమా ‘ఎవడు’ను అందుకోవడం కూడా కష్టంగా ఉంది ‘బ్రూస్ లీ’కి.

ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా రూ.27.30 కోట్లు మాత్రమే వసూలు చేసింది. మూడు రోజుల్లో ఇంతంటే.. ఫుల్ రన్ లో ఇంకెంతో అనుకోవచ్చు. కానీ వీక్ డేస్ తర్వాత కలెక్షన్లు బాగా వీకైపోయాయి. పైగా ఇంకో రెండు రోజుల్లో మూడు సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. దీంతో ‘బ్రూస్ లీ’ పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఎవడు సినిమా రూ.48 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. బ్రూస్ లీ దాన్ని అందుకునే అవకాశాలు కనిపించడం లేదు.

ఫుల్ రన్ లో ‘బ్రూస్ లీ’ రూ.40 కోట్ల మార్కు అందుకుంటే ఎక్కువ అన్నట్లుంది పరిస్థితి. ఈ సినిమాకు తెలుగు, తమిళం కలిపి రూ.59 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. తెలుగు వెర్షన్ మాత్రమే రూ.57 కోట్ల దాకా హక్కులు అమ్మారు. ఆ మార్కును ‘బ్రూస్ లీ’ అందుకోవడం అసాధ్యమే. అన్ని ఏరియాల్లోనూ బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు. ముఖ్యంగా నైజాం డిస్ట్రిబ్యూటరుకే భారీగా కోత పడేలా ఉంది. ఇక్కడ రైట్స్ రూ.13.8 కోట్లకు అమ్మగా ఇప్పటిదాకా వీకెండ్ షేర్ రూ.6.0 కోట్లు మాత్రమే వచ్చింది. ఫుల్ రన్ లో రూ.10 కోట్లకు మించి వచ్చేలా లేదు.