Begin typing your search above and press return to search.
10 రోజుల్లో బ్రూస్ లీ రాబట్టింది 38 కోట్లు
By: Tupaki Desk | 27 Oct 2015 11:20 AM GMTమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బ్రూస్ లీ. ఇప్పటికి ఈ మూవీ రిలీజై 10 రోజులైంది. ఈ టెన్ డేస్ లో బ్రూస్ లీ కలెక్ట్ చేసిన మొత్తం అక్షరాలా 55.5 కోట్లు. ఇది టోటల్ గ్రాస్ కాగా.. సినిమా కలెక్ట్ చేసిన షేర్ 38.29 కోట్ల రూపాయలు. ఇందులో 30.59 కోట్లు కేవలం ఏపీ - తెలంగాణల నుంచే రాగా... మిగిలిన మొత్తం కర్నాటక - యూఎస్ సహా.. అన్నిచోట్లా కలిపి తెలుగు వెర్షన్ కలెక్ట్ చేసిన మొత్తం. అంటే ఇప్పటికి కలెక్ట్ అయిన మొత్తం 38.29 కోట్లే.
కానీ బ్రూస్ లీ థియేట్రికల్ రైట్స్ ని అక్షరాలా 56 కోట్లకు విక్రయించారు. అంటే.. ఇంకా 18 కోట్లు రాబడితేనే... పెట్టుబడి తిరిగొస్తుంది. కానీ అంత లాంగ్ రన్ ఉండకపోవచ్చనే విషయం స్పష్టంగానే తెలుస్తోంది. మొదటి మూడ్రోజుల్లో 25 కోట్లు కొల్లగొట్టిన బ్రూస్ లీ.. తర్వాత వారం రోజులు కలిపి 13 కోట్లు రాబట్టాడు. చివరి మూడు రోజులు కలిపి వచ్చిన మొత్తం మూడు కోట్లే. అంటే రోజుకో కోటి లెక్కన వేసుకోవచ్చు. అది కూడా ఇప్పటివరకూ దసరా హాలిడేస్ కావడంతో.. ఈ మాత్రం నెట్టుకొచ్చేశాడు బ్రూస్ లీ.
ఇకపై వచ్చేవి అంతంతమాత్రంగానే ఉండే అవకాశముంది. అంటే బ్రూస్ లీపై పెట్టుబడి పెట్టినోళ్లకి పెద్ద మొత్తంలోనే నష్టపోక తప్పదన్నమాట. అయితే.. మొదటి రోజునే నెగిటివ్ వచ్చిన మూవీకి.. మూడింట రెండొంతులు వెనక్కి రావడం మాత్రం ఊరటనిచ్చే విషయమే.