Begin typing your search above and press return to search.
26న బ్రూస్ లీ ఆడియో.. మెగాస్టారే గెస్ట్
By: Tupaki Desk | 13 Sep 2015 9:35 AM GMTరామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న బ్రూస్ లీ .. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్. శ్రీనూ శైలికి భిన్నంగా తెరకెక్కుతున్న సినిమా ఇదన్న ప్రచారంతో మెగాభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. రొటీన్ శ్లాప్ స్టిక్ కామెడీలకు, ఒక్క దెబ్బకి అల్లంత దూరాన ఎగిరిపడడాలు ఈ సినిమాలో ఉండవనే ఆశిస్తున్నారంతా. రొటీన్ కమర్షియల్ స్టఫ్ తో ఈ సినిమాని తీయడానికి చెర్రీ - చిరంజీవి వ్యతిరేకించారని .. ఇక చరణ్ ని కొత్తగా చూసే ఛాన్సుందని అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అంచనాల్ని చరణ్ నిజం చేస్తాడో లేదో తెలీదు కానీ, ఇప్పటికైతే ఆడియో రిలీజ్ ఈనెల 26న అని ప్రకటించాడు.
పాటలు వచ్చేస్తున్నాయ్. తమన్ మ్యూజిక్ వినేందుకు రెడీ కండి అని చెబుతున్నాడు. ఈ సినిమాలో చరణ్ తో కలిసి మెగాస్టార్ స్టెప్పులు కలిపారు... కాబట్టి ఆడియోపై అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. పాటల వేడుకలో చిరు డ్యాన్స్ మూవ్స్ వీడియో చూడాలన్న తహతహలో ఉన్నారంతా. ఇప్పటికే తమన్ అన్ని పాటల్ని కంపోజ్ చేసేశాడు. ఒకే ఒక్క పాట బ్యాలెన్స్. ఆడియో ఎలానూ వచ్చేస్తోంది. అయితే శ్రీనూ ఎలా మారాడో తమన్ కూడా అలానే మారిన మ్యూజిక్ డైరెక్టర్ అనిపిస్తాడేమో చూడాలి. ఏ.ఆర్.రెహమాన్‌ని మించి ఇన్నోవేటివ్ థాట్స్ తో కొత్త ట్యూన్ లు ఇస్తాడనే ఆశిద్దాం. ఈ ఆడియో విజయానికి తొలి మెట్టు. చెర్రీకి కిక్కిచ్చే ఆడియో వస్తుందా? లేదా? వెయిట్ అండ్ సీ.