Begin typing your search above and press return to search.

60 కోట్లు దాటకపోతే బ్రూస్‌ లీ ఫ్లాప్‌

By:  Tupaki Desk   |   15 Oct 2015 9:41 AM GMT
60 కోట్లు దాటకపోతే బ్రూస్‌ లీ ఫ్లాప్‌
X
ఇంతకుముందు సినిమా హిట్టా ప్లాపా అనేది అది ఆడే రోజుల్ని, 50-100 రోజుల సెంటర్ల బట్టి చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడంతా ఇప్పుడంతా కోట్లల్లో నడుస్తోంది లెక్క. పెట్టుబడి ఎంత.. సినిమా ఆ మొత్తం వసూలు చేసిందా.. దాని మీద ఎంత లాభం వచ్చింది.. తొలి వీకెండ్లో ఎంతొచ్చింది.. ఫుల్ రన్ లో ఎన్ని కోట్లు కొల్లగొట్టింది అన్నదాన్ని బట్టి సినిమా రేంజిని అంచనా వేస్తున్నారు. పోయిన శుక్రవారం విడుదలైన ‘రుద్రమదేవి’ ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల దాకా వసూలు చేసింది. అయినా ఆ సినిమాను హిట్టు అనడానికి లేదు. అలా అనిపించుకోవడానికి గుణశేఖర్ సినిమా ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి.

ఇక ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘బ్రూస్ లీ’ సినిమా సంగతి చూస్తే.. ఈ మూవీ రూ.60 కోట్లకు తక్కువ కలెక్ట్ చేస్తే ఫ్లాప్ కిందే లెక్క. ఎందుకంటే ఆ సినిమాకు ఆ స్థాయిలో బిజినెస్ జరిగింది. ‘బ్రూస్ లీ’ తెలుగు వెర్షన్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా రూ.56.45 కోట్ల బిజినెస్ చేయడం విశేషం. తమిళం, మలయాళ వెర్షన్లు కూడా కలుపుకుంటే లెక్క రూ.60 కోట్లు మార్కు దాటిపోతుంది. తెలుగు వెర్షన్ ఏరియాల వారీగా చేసిన బిజినెస్ చూస్తే.. నైజాంలో ఈ సినిమా మీద డిస్ట్రిబ్యూటర్ రూ.13.8 కోట్ల పెట్టుబడి పెట్టాడు. సీడెడ్ (రాయలసీమ) ఏరియాకు రైట్స్ రూ.8.1 కోట్లకు అమ్మారు. నెల్లూరు (రూ.2.05 కోట్లు), గుంటూరు (4.05 కోట్లు), కృష్ణా (రూ.2.9 కోట్లు), వైజాగ్ (రూ.5.4 కోట్లు), తూర్పు గోదావరి (రూ.3.25 కోట్లు), పశ్చిమ గోదావరి (రూ..2.9 కోట్లు) జిల్లాల రేట్లు కూడా బాగానే పలికాయి. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ఏరియాలకు రూ.14 కోట్ల దాకా రైట్స్ అమ్మారు. కాబట్టి మొత్తం లెక్క రూ.60 కోట్ల దాకా తేలుతోంది కాబట్టి.. ఆ మార్కును అందుకుంటేనే ‘బ్రూస్ లీ’ని హిట్టు ఖాతాలో వేయగలం.