Begin typing your search above and press return to search.
థియేటర్స్ ఉన్నాయ్.. కలెక్షన్స్ వస్తాయా?
By: Tupaki Desk | 23 Oct 2015 3:55 AM GMTబ్రూస్ లీకి డివైడ్ టాక్ వచ్చాక.. కలెక్షన్స్ మీద అనేక అనుమానాలు తలెత్తాయి. దీనికి తోడు విజయదశమి రోజున మూడు కొత్త సినిమాలు రిలీజ్ కావడంతో.. డౌట్స్ పెరిగిపోయాయి. వీటిలో ఒకటి మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కావడంతో.. మెగాఫ్యాన్స్ అండ కూడా ఉండదేమో అని అనుకున్నారు. అసలు థియేటర్ల నుంచే తప్పించేస్తారని భావించారంతా.
అయితే.. బ్రూస్ లీ లెక్క బాగానే ఉంది. చాలా సెంటర్లలో రిలీజ్ ఇచ్చినవాటిలో 50 నుంచి 70శాతం స్క్రీన్స్ లో.. రామ్ చరణ్ మూవీనే కంటిన్యూ చేస్తున్నారు. గుణశేఖర్ రుద్రమదేవి ఈవారంలో బాగా డల్ అవడం, ఇప్పుడొచ్చినవాటిలో కంచె తప్ప మిగతావి లో బడ్జెట్ మూవీస్ కావడంతో.. ఎక్కువ స్క్రీన్స్ లో పడలేదు.
అలాగే.. మొదటి రోజే డివైడ్ టాక్ స్ప్రెడ్ అయినా.. తొలి ఆరు రోజుల్లో బ్రూస్ లీ 30 కోట్లకు పైగా కలెక్ట్ చేశాడని తెలుస్తోంది. ఫుల్ రన్ లో ఇంకో పది కోట్లు వచ్చే అవకాశాలున్నాయని కూడా చెప్పుకుంటున్నారు. ఇంత బ్యాడ్ టాక్ వచ్చిన మూవీకి 45 కోట్లు వస్తాయని చెబ్తున్నారంటే.. మాస్ మార్కెట్ లో చెర్రీ స్టామినా అర్ధమవుతుంది. మెగాస్టార్ కేమియో, క్రేజ్ తో పాటు.. పండుగ సెలవలు చెర్రీకి బాగానే కలిసొచ్చినట్లు అనిపిస్తోంది.