Begin typing your search above and press return to search.

అబ్బాయికి బాబాయ్‌ మీద ఉన్న ప్రేమట

By:  Tupaki Desk   |   2 Sep 2015 4:10 AM GMT



పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా.. సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ రిలీజ్ చేసి పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తే... పవన్ కు బర్త్ డే విషెస్ చెప్పేందుకు బ్రూస్ లీ సెకండ్ టీజర్ లాంఛ్ చేశాడు మెగా పవర్ స్టార్. మొదట రిలీజ్ చేసిన టీజర్ ఫక్తు యాక్షన్ సన్నివేశాలతో నిండిపోతే... ఇది మాత్రం ఎమోషన్స్, రొమాన్స్ తో నిండిపోయింది. టైటిల్, ఫస్ట్ టీజర్ కారణంగా... ఈ మూవీకి ఫ్యామిలీ ఆఢియన్స్ దూరమవుతారనే డౌట్ వచ్చుంటుంది. అందుకే చెర్రీని ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత చేరేందుకు బ్రూస్ లీకి సాఫ్ట్ లుక్ ఇచ్చారు.

తన ఫ్యామిలీకి చెర్రీని రకుల్ పరిచయం చేసే సీన్ తో మొదలుపెట్టి.... దాదాపు ట్రైలర్ అంతా ఫ్యామిలీ రిలేషన్స్ తోటే నింపారు. ముఖ్యంగా రకుల్, చరణ్ ల మధ్య అఫెక్షన్ బాగా పండింది. రకుల్ బైక్ డ్రైవ్ చేస్తుంటే...చరణ్ వెనకాల కూర్చుని రావు రమేష్ చూడ్డంతో ఇబ్బంది పడే సీన్.. చూడ్డానికే లవ్లీ గా ఉంది. మొత్తానికి బ్రూస్ లీలో ఫ్యామిలీ డ్రామాని బాగానే ఉన్నట్లు అర్ధమవుతుంది. మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న రామ్ చరణ్... క్లాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యేందుకే గోవిందుడు అందరివాడే మూవీని చేశాడు. ఇప్పుడు.. నెక్స్ట్ మూవీకి వచ్చేసరికి.. మాస్ ని, క్లాస్ ని కలిపి కుమ్మేసిట్లుగా ఉన్నాడు.

రామ్ చరణ్ తో రొమాన్స్ విషయంలో రకుల్ కూడా బాగా ఒదిగిపోయింది. నదియాతో సహా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ... బాగా ఎక్స్ పీరియన్స్ ఆర్టిస్టులే ఉండడంతో.. టీజర్ లోనే ప్రతీ సీన్ కంటికి ఇంపుగా కనిపిస్తోంది. బ్రూస్ లీకి నివాళిగా ఫైటింగులు, రకుల్ తో రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, చరణ్ డ్యాన్సులు, శ్రీను వైట్ల మార్క్ స్క్రీన్ ప్లే, మెగాస్టార్ తో సహా పలువురు హీరోల స్పెషల్ అప్పియరెన్స్... హైలైట్స్ వింటుంటేనే మెస్మరైజింగ్ ఉంది కదూ. చూస్తుంటే చరణ్ తో వైట్ల బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ఈ టీజర్‌ గురించి కామెంట్‌ చేస్తూ.. చరణ్‌ బావ సాయిధరమ్‌ తేజ్‌ ఏమంటున్నాడంటే.. ''అబ్బాయికి బాబాయ్‌ మీద ఉన్న ప్రేమ ఈ ఒక్క టీజర్‌ తో బయటపడింది'' అని చెప్పుకొచ్చాడు.