Begin typing your search above and press return to search.
నో డౌట్.. అక్టోబర్ 16ను చెర్రీ ఫిక్స్
By: Tupaki Desk | 6 Sep 2015 6:18 AM GMTచరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న బ్రూస్ లీ టీజర్ లు ఇప్పటికే అభిమానుల్లో, కామన్ జనాల్లో డిష్కసన్ పాయింట్. ఇదో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ విలువలతో శ్రీను శైలికి డిఫరెంటుగా తెరకెక్కుతున్న సినిమా... అని అందరికీ ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుంది? దసరా బరిలో చరణ్ వస్తాడా? రాడా? అన్న సందిగ్ధంలో ఉన్నారంతా. అక్టోబర్ 16 రిలీజ్ అంటూ ఇప్పటికే ప్రకటించారు .. కానీ అప్పటికి రావడం కుదురుతుందా? అన్న సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారంతా.
సరిగ్గా ఈ టైమ్ లో నిర్మాత డివివి దానయ్య చరణ్ సినిమా విషయమై ఓ క్లారిటీ ఇచ్చారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతూ.. అంతా అనుకుంటున్నట్టు మా సినిమా వాయిదా వేయడం అనేది ఉండదు. చెప్పిన టైముకే వచ్చేస్తున్నాం. దసరా బరిలో చరణ్ వచ్చేస్తున్నాడు అని అధికారికంగా ప్రకటించారు. దీన్నిబట్టి చరణ్ తో అఖిల్ పోటీపడాల్సిందేనని అందరికీ అర్థమవుతోంది. అఖిల్ సినిమా అక్టోబర్ 21న వస్తోంది అంటూ ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసేశారు. కాబట్టి చరణ్‌కి అఖిల్ కి మధ్య ఐదు రోజులే గ్యాప్ కనిపిస్తోంది. రెండు క్రేజీ ప్రాజెక్టులు దసరా సెలవులకు ఖర్చీఫ్ వేసేశాయి కాబట్టి ఇక తాము రంగంలోకి దిగినా పనవ్వదని భావించినవారంతా ఇప్పటికే తమ సినిమాల్ని వాయిదాలు వేసుకుంటున్నారు. అక్టోబర్ 16న ఢీ కొడుతున్నామని నిర్మాత స్వయంగా చెప్పారు కాబట్టి ఇక చరణ్ రాక కన్ఫమ్ అనుకోవాల్సిందే.