Begin typing your search above and press return to search.

స్టెప్స్ లో చెర్రీ, గ్లామర్ లో రకుల్

By:  Tupaki Desk   |   30 Sep 2015 3:38 PM GMT


బ్రూస్ లీ మూవీకి లే చలో.. అంటూ ఓ సాంగ్ మేకింగ్ ని, తర్వాత రెండు నిమిషాల వీడియోని రిలీజ్ చేశారు ఇప్పటికే. స్టన్నింగ్ విజువల్స్ - టెప్టింగ్ రొమాన్స్ తో ఆ పాట ఇప్పటికే టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారిపోయింది. ఇప్పుడు రియా అంటూ ఇంకో పాటకి సంబంధించిన మేకింగ్ విడుదల చేసింది బ్రూస్ లీ యూనిట్.

లిరిక్ లేకపోయినా.. కేవలం మ్యూజిక్ వరకే ఇచ్చారు రియా సాంగ్ కి. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టెప్స్ - కాస్టూమ్స్ - స్టైలింగ్ అదిరిపోయేలా ఉన్నాయి. రకుల్ గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్. మరోసారి స్టెప్స్ విషయంలో చెర్రీ కాంప్రమైజ్ కావడం లేదనే విషయం మేకింగ్ చూస్తేనే అర్ధమవుతోంది. మ్యూజిక్ విషయంలో తమన్ కూడా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు ఈ ప్రాజెక్ట్ ని.

ఆడియో రిలీజ్ కి టీజర్ గా విడుదల చేసిన రియా మేకింగ్ ఆద్యంతం థ్రిల్లింగ్ గా రూపొందించారు. సినిమాని స్పీడ్ గా కంప్లీట్ చేస్తున్నా... క్వాలిటీలో కాంప్రమైజ్ కావడం లేదనే విషయం.. ఈ రెండు సాంగ్స్ విజువల్స్ చూస్తే అర్ధమవుతోంది. 7 ఏళ్ల తర్వాత మెగాస్టార్ 3 నిమిషాల స్పెషల్ కేరక్టర్ లో నటించబోతున్న బ్రూస్ లీకి.. అక్టోబర్ 2న హైద్రాబాద్ లోని హైటెక్స్ లో గ్రాండ్ ఆడియో ఫంక్షన్ చేయబోతున్నారు.