Begin typing your search above and press return to search.
కెజిఎఫ్ స్ఫూర్తితో బ్రూటల్ మర్డర్
By: Tupaki Desk | 18 March 2019 6:42 AM GMTసినిమాలు సమాజం మీద ప్రభావం చూపించవు అనుకుంటాం కానీ ఏదో ఒక రూపంలో ఎంతో కొంత ఉండకుండా అయితే పోదు. టీనేజ్ ప్రేమలు మొదలుకుని ఫ్యాక్షన్ హత్యల దాకా వీటి తాలూకు పరిణామాలు గతంలో చాలా చూశాం. ఆ మధ్య హైదరాబాద్ లో ఓ టెన్త్ క్లాస్ కుర్రాడి కిడ్నాప్ హత్య వెనుక ఓ సినిమా స్ఫూర్తి ఉందని హంతుకుడు చెప్పడం చూసి పోలీసులు షాక్ అయ్యారు.
తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి జరిగింది. కేరళలో అనంతు అనే వ్యక్తి అత్యంత దారుణమైన రీతిలో హత్య చేయబడ్డాడు. జరిగిన విధానం చూస్తే ఒళ్ళు గగుర్పాటుకు గురయ్యేలా ఈ మొత్తం తతంగాన్ని నిందితుడు వీడియో షూట్ చేయడం షాక్ కలిగించే అంశం.
డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతు అనే వ్యక్తికి విష్ణు రాజ్ తో శత్రుత్వం ఉంది. ఈ ఇద్దరూ డ్రగ్ డీలర్స్. స్థానిక వ్యవహారాల్లో విభేదాలు రావడంతో ఎక్కడో ఓ జాతరలో తీవ్రంగా కొట్టుకున్నారు. విష్ణు రాజ్ కు కెజిఎఫ్ సినిమా అంటే పిచ్చి. అందులో కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకుని అనంతుని మర్డర్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు. అంతే తన సోదరులుతో కలిసి మొత్తం 13 మందిని గ్యాంగ్ గా చేసుకుని అనంతును కిడ్నాప్ చేసి ఏకాంత ప్రదేశంలోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేసి వీడియో తీసుకున్నారు.
అక్కడితో ఆగలేదు. కెజిఎఫ్ లోనే రెండు మూడు డైలాగులు గర్వంగా చెబుతూ అందులోనే పొందుపరచడం పోలీసులను సైతం విస్మయపరిచింది. అందరూ అరెస్ట్ అయ్యారు. దీనికి సినిమా టీమ్ కు సంబంధం లేనప్పటికీ ఒక్కోసారి తెరమీద చూపే దురాగతాలు ఇలా కూడా ప్రభావం చూపిస్తాయి అని తెలుసుకోవడమే బాధాకరం