Begin typing your search above and press return to search.

బుచ్చిబాబు - చరణ్.. మొదలయ్యేది అప్పుడే!

By:  Tupaki Desk   |   23 Dec 2022 1:34 PM GMT
బుచ్చిబాబు - చరణ్.. మొదలయ్యేది అప్పుడే!
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం తన 15వ సినిమాను అగ్రదర్శకుడు శంకర్ దర్శకత్వంలో పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సింది. కానీ ఊహించని విధంగా కొన్ని వివాదాలతో సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇక ప్రస్తుతం దర్శకుడు శంకర్ మరో షెడ్యూల్ తో వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.

రామ్ చరణ్ 15వ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే కాస్త ఎక్కువ సమయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ తేజ్ ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసిన తర్వాతనే బుచ్చిబాబు సినిమాను మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు అందుకోసం చరణ్ ముందు నుంచే పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలని అనుకుంటున్నాడు.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కంటెంట్ తో లో ఒక పిరియాడిక్ ఫిలిం గా తెరపైకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ ను గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నట్లు సమాచారం. కంటెంట్ పరంగానే కాకుండా కమర్షియల్ ఆడియన్స్ కు నచ్చే విధంగా రామ్ చరణ్ ను కూడా చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడట. అయితే ఇటీవల స్క్రిప్ట్ పనులు కాస్త తుది దశకు చేరుకోగా రామ్ చరణ్ షూటింగ్ ఎప్పుడు మొదలు పెడదాము అనే విషయంలో కూడా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.

అయితే ఎలాగు శంకర్ సినిమా సమ్మర్ సమయానికి ముగుస్తుంది కాబట్టి ఆ తర్వాత ఒక నెల రోజులు గ్యాప్ తీసుకొని బుచ్చిబాబు సినిమాను మొదలు పెట్టాలని చరణ్ ఆలోచిస్తున్నాడు. అంటే 2023 జూన్ లేదా అంతకంటే ఒక నెల ముందు రోజులే బుచ్చిబాబు ప్రాజెక్ట్ స్టార్ట్ కావచ్చు అని తెలుస్తోంది.

ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు అయితే పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ను మొత్తం సిద్ధం చేసుకుంటున్నాడు. షూటింగ్ కు వెళ్ళిన తర్వాత మళ్లీ ఎలాంటి చేంజెస్ లేకుండా కూడా ముందుగానే స్క్రిప్ట్ లాక్ చేసుకోబోతున్నారట. ఇక సినిమాను 2023 జూన్ సమయానికి మొదలుపెట్టినా కూడా దాదాపు షూటింగ్ పూర్తి కావడానికి ఏడాది కావచ్చు అని కూడా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.