Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కాంపౌండ్ కి ద‌గ్గ‌ర‌వుతున్న డైరెక్ట‌ర్‌!

By:  Tupaki Desk   |   7 Aug 2022 1:30 AM GMT
ఎన్టీఆర్ కాంపౌండ్ కి ద‌గ్గ‌ర‌వుతున్న డైరెక్ట‌ర్‌!
X
యంగ్ డైరెక్ట‌ర్స్ టాలీవుడ్ లో గ‌త కొంత కాలంగా అద్భుతాలు సృష్టిస్తున్నారు. తొలి ప్ర‌య‌త్నంలోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లని సొంతం చేసుకుంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. అదే స‌మ‌యంలో స్టార్ హీరోల‌ని కూడా ఆక‌ట్టుకుంటూ వారి దృష్టిలో ప‌డుతున్నారు.

స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబ సాన `ఉప్పెన‌` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మించిన ఈ మూవీ గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.

తొలి సినిమాతో వంద కోట్ల క్ల‌బ్ లో చేరిన డైరెక్ట‌ర్ గా బుచ్చిబాబు రికార్డుని సొంతం చేసుకున్నారు. ఈ మూవీతో ఇండ‌స్ట్రీలో వున్న స్టార్ హీరోల దృష్టిలో ఆక‌ర్షించిన బుచ్చిబాబు ..స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో ఓ భారీ మూవీకి ప్లాన్ చేశాడు. శ్రీ‌కాకుళం నేప‌థ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేశాడు. స్క్రిప్ట్ కూడా ఫైన‌ల్ అయింది. కానీ ఎన్టీఆర్ నుంచి మాత్రం ఫైన‌ల్ గా గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు.

దీంతో ఎన్టీఆర్ తో బుచ్చిబాబు చేయాల‌నుకున్న స్పోర్ట్స్ డ్రామా పెండింగ్ లో ప‌డిపోయింది. ఇదిలా వుంటే ఎన్టీఆర్ సోద‌రుడు, హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ న‌టించిన `బింబిసార‌` మూవీ శుక్ర‌వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యంగ్ డైరెక్ట‌ర్ మ‌ల్లిడి వ‌శిష్ట ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఈ మూవీ మార్నింగ్ షో తో మంచి టాక్ ని సొంతం చేసుకుని హిట్ అనిపించుకుంది.

ఈ నేప‌థ్యంలో `బింబిసార‌` స‌క్సెస్ పై ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆస‌క్తికంగా ట్వీట్ చేశాడు. ఇది మాసిక్ (మాస్ ప్ల‌స్ క్లాస్‌) బ్యాక్ బ‌స్ట‌ర్ అని క‌ల్యాణ్ రామ్ కు అభినంద‌లు తెలియ‌జేశాడు. ఈ సంద‌ర్భంగా హీరో క‌ల్యాణ్ రామ్ కు స్వ‌యంగా బొకేని అందించిన ఫొటోని అభిమానుల‌తో పంచుకున్నాడు. అంతే కాకుండా ద‌ర్శ‌కుడు వశిష్ణ మీరు చెప్పిన క‌థ‌, క‌థ‌ని న‌డిపించిన తీరు సూఐప‌ర్బ్ అన్నారు. అంతే కాకుండా లెజెండ‌రీ కీర‌వాణిగారు సినిమాని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు నంద‌మూరి ఫ్యామిలీ హీరోల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వ్వ‌డానికి ట్రై చేస్తున్నాడ‌ని, బుచ్చిబాబు తను ఎన్టీఆర్ తో చేయాల‌నుకుంటున్న సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించ‌నుందా? అందుకే కల్యాణ్ రామ్ ని బుచ్చిబాబు ప్ర‌త్యేకంగా క‌లిశారా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ డైరెక్ష‌న్ లో త‌న 30వ ప్రాజెక్ట్ ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ తరువాత `కేజీఎఫ్` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్ట్ వుంటుంది. ఆ త‌రువాతే బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.