Begin typing your search above and press return to search.
బోయపాటి మీద డబుల్ ప్రెజర్
By: Tupaki Desk | 17 Feb 2019 10:55 AM GMTఎన్టీఆర్ నేర్పిన పాఠం గట్టిగానే వినిపించింది కాబోలు బాలకృష్ణ తన తర్వాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. మహానాయకుడు ఫలితం ఇంకా వెలువడకపోయినా మరీ అద్భుతాలు చేసేంత సీన్ లేదని అర్థమైపోవడంతో జరిగిన డ్యామేజ్ రిపేర్ అవ్వాలి అంటే వచ్చే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. వినయ విధేయ రామతో సూపర్ డిజాస్టర్ అందుకున్న బోయపాటి శీను దానికి దర్శకుడు కావడం అభిమానులను ఇప్పటికే టెన్షన్ పెడుతోంది.
బడ్జెట్ ఎక్కువ డిమాండ్ చేసినా కేవలం 40 నుంచి 50 కోట్ల లోపే పూర్తి చేయాలని' బాలకృష్ణ స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చాడని ఇప్పటికే టాక్ ఉంది. అంతే కాదు బోయపాటి శీనుకు సెపరేట్ గా ఆఫీస్ తీయకుండా ఎన్బికె ఫిలిమ్స్ కార్యాలయాన్నే వాడుకోమని కూడా చెప్పారట. అర్థం చేసుకున్న బోయపాటి ప్రస్తుతం స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడుబోయపాటి శీను మీద ఇప్పుడు రెండు రకాల ఒత్తిడి ఉంది. వినయ విధేయ రామ విషయంలో అన్ని నిందలు తనే పడాల్సి రావడం రామ్ చరణ్ సారీ నోట్ లో తన పేరు ప్రస్తావించకపోవడం నిర్మాత దానయ్యతో విభేదాలు ఇవన్నీ బాగా డిస్టర్బ్ చేశాయి.
వీటి గురించి ఇకపై చర్చ రాకూడదు అంటే బాలయ్యతో తీసే సినిమా మాములు హిట్ అయితే సరిపోదు, లెజెండ్ ని మించి ఆడాలి. మరోవైపు ఎన్టీఆర్ తాలూకు గాయాలు బాలయ్యకు మానాలి అంటే ఇది ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఈ ప్రెజర్ మొత్తం బోయపాటి శీను మీదే పడుతుంది. పైగా హ్యాట్రిక్ కాంబినేషన్ అన్న ట్యాగ్ ఒకటి తగిలిస్తున్నారు ఫాన్స్. ఎక్కడ చిన్న తేడా వచ్చినా అంతే సంగతులు. అందుకే షూటింగ్ ప్రారంభం కాస్తా ఆలస్యం అయినా హిట్ పడే స్క్రిప్ట్ తోనే సెట్స్ పైకి వెళ్లాలని హీరో దర్శకుడు నిర్ణయించుకున్నట్టు టాక్