Begin typing your search above and press return to search.

నాలుగేళ్ల త‌ర్వాత బుజ్జిగాడు బ్యూటీ ఇలా?

By:  Tupaki Desk   |   26 Nov 2022 1:30 AM GMT
నాలుగేళ్ల త‌ర్వాత బుజ్జిగాడు బ్యూటీ ఇలా?
X
'బుజ్జిగాడు' తో టాలీవుడ్ లో ఫేమ‌స్ అయిన క‌న్న‌డ బ్యూటీ సంజ‌నా గ‌ల్రానీ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. టాలీవుడ్ లో చేసింది త‌క్కువే సినిమాలే గానీ అమ్మ‌డికి యువ‌త‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్ప‌టిక‌ప్ప‌డు హీటెక్కించే ఫోటోల‌తో కాక‌లు పుట్టిస్తుంది. స్టార్ హీరోయిన్ గా స్థిర‌ప‌డాల‌ని చాలా క‌ల‌లు కంది. కానీ అనుకున్న విధంగా సాగ‌లేదు.

సెకెండ్ లీడ్స్ తోనే సరి పెట్టుకోవాల్సి వ‌చ్చింది. అదీ చాలా అరుదుగానే ఆ త‌ర‌హా అవ‌కాశాలు కూడా అందుకుంది. ఆ త‌ర్వాత అమ్మ‌డి డిమాండ్ పూర్తిగా ప‌డిపోయింది. దీంతో ఇత‌ర భాష‌ల్లోనూ కొన్ని సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం త‌మిళ్..మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాలు చేస్తుంది. చివ‌రిగా తెలుగులో దండు పాళ్యం3 లో న‌టించింది. ఆ సినిమా రిలీజ్ అయి నాలుగేళ్లు అవుతుంది.

అదీ ఓ క‌న్న‌డ సినిమా డ‌బ్బింగ్ రూపంలో. స్ర్టెయిట్ తెలుగు సినిమా అయితే 2017 లో రిలీజ్ అయిన 2 కంట్రీస్ గా తెలుస్తోంది. ఆ త‌ర్వాత అమ్మ‌డికి తెలుగులో అవ‌కాశాలే రాలేదు. క‌న్న‌డ‌..త‌మిళ్ భాషల్లో కొన్ని సినిమాలు చేస్తూ కెరీర్ బండి లాగిస్తుంది. అయితే తాజాగా టాలీవుడ్ లో మ‌ణిశంక‌ర్ అనే సినిమాలో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. శివ కంఠ‌మ‌నేని అనే యంగ్ హీరోకి జోడీగా న‌టిస్తున్ట‌న్లు తెలుస్తోంది.

అమెతో పాటు ప్రియా హెగ్దే అనేకొత్త అమ్మాయి న‌టిస్తుంది. మ‌రి ఇందులో సంజ‌న‌ది సెకెండ్ లీడా? ఫ‌స్ట్ లీడ్ నా అన్న‌ది తెలియాలి. ఈసినిమాలో అవ‌కాశం ప‌ట్ల సంజ‌న సంతోషం వ్య‌క్తం చేసింది. కోవిడ్ త‌ర్వాత నాకీ సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది. చ‌క్క‌టి ప్ర‌ణాళిక‌తో చిత్రాన్ని పూర్తిచేసారని తెలిపింది. ఈ సినిమాలో సంజ‌న పాత్ర‌లో చాలా కోణాలున్నాయ‌ట‌.

ఆమెలోని ప‌రిపూర్ణ న‌టిని సినిమాలో చూపిస్తున్న‌ట్లు యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తుంది. యాక్టింగ్ ప‌రంగా ఆమెలో చాలా షేడ్స్ ఉన్నాయ‌న్న విష‌యం సెట్స్ కి వెళ్లిన త‌ర్వాత త‌మ‌కి అర్ధ‌మైంద‌ని చిత్ర బృందం అంటోంది. ఈసినిమా స‌క్సెస్ తో సంజ‌నకి మ‌రిన్ని అవ‌కాశాలు రావాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. చిన్న సినిమా నిర్మాత‌ల‌కు సంజ‌న అందుబాటులో ఉండే హీరోయిన్. మ‌రి ఇప్ప‌టి నుంచైనా బ్యూటీకి ప్రోత్సాహం ఉండాల‌ని ఆశిద్దాం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.