Begin typing your search above and press return to search.

కోడి కోసం బండ్ల గణేష్ ఆరాటం.. కరోనాతో పోరాటం

By:  Tupaki Desk   |   31 March 2020 10:30 AM GMT
కోడి కోసం బండ్ల గణేష్ ఆరాటం.. కరోనాతో పోరాటం
X
బండ్ల గణేష్.. ఈ టాలీవుడ్ నటుడు, నిర్మాత సినిమాల్లో నటించడం కంటే బయట వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యాడు. రాజకీయాల్లో చేరి కాంగ్రెస్ గెలవకుంటే '7ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటానన్న'ఈయన డైలాగ్ బాగా పేలింది.

బండ్ల గణేష్ నిర్మాతగానూ రాణించారు. ఆయన ప్రధాన బిజినెస్ పౌల్ట్రీ. తెలంగాణలో అతిపెద్ద పౌల్ట్రీ ఇండస్ట్రీ బండ్ల గణేష్ కుటుంబానిదే.. కరోనా వైరస్ తో ఇప్పుడు కోళ్లను ఎవరూ తినడం లేదు. చికెన్ తింటే కరోనా వస్తుందనే పుకార్లతో అమ్మకాలు పడిపోయి ఉచితంగా కోళ్లను పంచేస్తున్నారు.

కోళ్ల పరిశ్రమపై ఆధారపడ్డ వ్యాపారులందరూ దివాళా తీశారు. తీవ్రంగా నష్టపోయారు. బండ్ల గణేష్ సైతం ఈ కరోనా వేళ నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశాడు. 'దీనబ్బా కరోనా.. ముందునుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. పౌల్ట్రీ పరిశ్రమలో కోట్లు పెట్టుబడి పెట్టాం.. భయంగా ఉందంటూ' ట్వీట్ లో వాపోయారు.

ఇక బండ్ల ట్వీట్ చేయగానే నెటిజన్లు ఎంట్రీ ఇచ్చి తెగ ఆడేసుకున్నారు. సెటైర్ల మీద సెటైర్లు వేశారు. బయట మార్కెట్లో కిలో 190కి చికెన్ పలికింది. నువ్వు బయట అమ్ము అంటూ సెటైర్ వేశారు. ట్రంప్ కు కాల్ చేయమని కొందరు ఎద్దేవా చేశారు. అయితే చికెన్ తింటే కరోనా రాదని.. అది మంచి బలవర్ధకం ఆహారం అని సీఎం కేసీఆర్ సహా వైద్యులు తెలుపడంతో ఇప్పుడు చికెన్ కు డిమాండ్ పెరిగింది. ఉత్పత్తి లేకపోవడంతో కిలో చికెన్ 200 దాటుతోంది.