Begin typing your search above and press return to search.

'అల వైకుంఠపురం' కోసం బన్నీ సాహసం

By:  Tupaki Desk   |   21 Oct 2019 12:30 PM IST
అల వైకుంఠపురం కోసం బన్నీ సాహసం
X
టాలీవుడ్ నటుల్లో కథలో ఒదిగిపోయే పాత్రలు చేయడంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుంటారు. ఆర్య సినిమా నుంచి ఇప్పటి నా పేరు సూర్య దాకా పాత్రకు తగ్గట్టుగా మారిపోతుంటారు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అల వైంకుఠపురం’ సినిమా కోసం కూడా బన్నీ పెద్ద సాహసమే చేశాడని తెలిసింది..

‘నా పేరు సూర్య’ సినిమా తర్వాత బాగా బరువు పెరిగిన అల్లు అర్జున్ ‘ అల వైకుంఠపురం’ చిత్రంలోని పాత్ర కోసం బరువు తగ్గాలని త్రివిక్రమ్ సూచించారట.. ఈ మేరకు ప్రత్యేక ట్రైనర్ ను పెట్టుకొని అల్లు అర్జున్ ఏకంగా 14 కిలోలు బరువు తగ్గడం గమనార్హం.

తాజాగా పోస్టర్లలో సన్నగా అయిపోయిన అల్లు అర్జున్ లుక్ చూసి అభిమానులు షాక్ అయిపోయారు. బన్నీ స్టైలిష్ లుక్ స్టన్నింగ్ గా ఉంది.

అయితే బన్నీ ఈ బరువు తగ్గడానికి పెద్ద సాహసమే చేశాడని ఫిలింనగర్ సమాచారం. నాలుగు నెలలుగా ‘కీటోజెనిక్ డైట్’ తీసుకున్నాడట.. ఫిట్ నెస్ ట్రైనర్ సూచనలు తూచా తప్పకుండా పాటించి 14 కిలోలు బరువు తగ్గడం గమనార్హం. దర్శకుడు త్రివిక్రమ్ కోరుకున్న రూపాన్ని తెచ్చుకోవడానికి అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడని తెలిసింది..

బన్నీ-త్రివిక్రమ్ మూవీ ‘అల వైకుంఠపురం’ వచ్చే సంక్రాంతికి విడుదలవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎమోషనల్ డ్రామాతోపాటు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందుతోంది.