Begin typing your search above and press return to search.

బన్నీ vs ప్రభాస్: పాన్ ఇండియా స్టార్స్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్..!

By:  Tupaki Desk   |   19 July 2022 8:30 AM GMT
బన్నీ vs ప్రభాస్: పాన్ ఇండియా స్టార్స్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్..!
X
టాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల పై దృష్టి పెట్టారు. ప్రతీ హీరో కూడా తమ మార్కెట్ ని విస్తరించుకోవాలని ఆశ పడుతున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ - అల్లు అర్జున్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి పలువురు హీరోలు నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు.

అయితే తమ అభిమాన హీరోకి ఎక్కువ ఫేమ్ ఉందంటూ ఇప్పుడు బన్నీ - డార్లింగ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. 'బాహుబలి: ది బిగినింగ్' 'బాహుబలి: ది కన్ క్లూజన్' సినిమాలతో ప్రభాస్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 'పుష్ప: ది రైజ్' చిత్రంతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటారు.

అయితే ఇటీవల ఇండియా టుడే మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై అల్లు అర్జున్ ముఖ చిత్రాన్ని ప్రచురించడంతో రెండు వర్గాల అభిమానుల మధ్య వివాదం చెలరేగింది. ది సౌత్ స్వాగ్ అంటూ భారతీయ సినిమాలో దక్షిణాది ఆధిపత్యం గురించి బన్నీ సృష్టించిన క్రాస్‌ ఓవర్ గురించి వివరించింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ తమ హీరో క్రేజ్ ఇదంటూ సోషల్ మీడియాలో సందడి చేశారు. ఇదే ప్రభాస్ అభిమానులు నెట్టింట గొడవకు దిగేలా చేసింది.

గతంలో ఇండియా టుడే మ్యాగజైన్ కవర్‌ పేజీలపై ముద్రించిన ప్రభాస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలు పెట్టారు. అల్లు అర్జున్ కంటే ముందుగా తమ హీరోనే కవర్ పేజీ మీదమెక్కిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ పరస్పరం ట్రోల్స్ చేసుకుంటున్నారు.

బన్నీ క్రేజ్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ అభద్రతభావంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని ఓ వర్గం నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారని.. ఆయన ఈ జెనరేషన్ లో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అని. డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు.

'బాహుబలి' సృష్టించిన సెన్సేషన్ కు గుర్తుగా అప్పట్లో ఇండియా టుడే కవర్ పేజీ పై ప్రభాస్ ఫోటోని ప్రచురించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ లైనప్ లో ఉన్న భారీ ప్రాజెక్ట్స్ ను బట్టి అతని క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. దీనికి బన్నీ ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.

వాస్తవానికి ప్రభాస్ కు 'బాహుబలి' సినిమా తరువాతే పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. అందులోనూ ఎస్ఎస్ రాజమౌళి వంటి అగ్ర దర్శకుడి సపోర్ట్ ఎలాగూ ఉంది. అయితే డార్లింగ్ దాన్ని కాపాడుకునేలా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు.

కానీ అల్లు అర్జున్ అలా కాదు. 'పుష్ప' సినిమా కంటే ముందే అతను బాలీవుడ్ కి సుపరిచితమే. డబ్బింగ్ చిత్రాలతో అక్కడ మంచి క్రేజ్ ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా 'పుష్ప: ది రైజ్' చిత్రంతో నార్త్ మార్కెట్ లో సత్తా చాటారు.

పుష్పరాజ్ గా బన్నీ పెర్ఫార్మన్స్ మరియు తగ్గేదేలే అనే అతని మేనరిజం దేశవ్యాప్తంగా ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. అందుకే ఇప్పుడు ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీ పైకి ఎక్కాడు. కాబట్టి బన్నీని తక్కువ చేయడం కరెక్ట్ కాదనేది మెజారిటీ వర్గం అభిప్రాయం.

ఏదేమైనా ఇద్దరు హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్నందుకు అందరూ గర్వంగా ఫీల్ అవ్వాలి కానీ.. ఇలా ఎవరి ఫేమ్ ఎక్కువ అని మనంలో మనం నెట్టింట గొడవకు దిగడం సరికాదని న్యూట్రల్ ఆడియన్స్ అభిప్రాయ పడుతున్నారు.