Begin typing your search above and press return to search.
యాహూ ఇయర్-ఎండ్ లిస్ట్-2021లో బన్నీ - సమంత..!
By: Tupaki Desk | 4 Dec 2021 9:53 AM GMTయాహూ సెర్చ్ ఇంజిన్ ప్రతి ఏడాది నెట్టింట ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రముఖ వ్యక్తులు, న్యూస్ మేకర్స్ మరియు ఈవెంట్స్ జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. 2021 లో దేశ వ్యాప్తంగా అత్యధిక మంది సెర్చ్ చేసిన సెలబ్రిటీలను యాహూ ప్రకటించింది. ఈ ఏడాది నెటిజన్స్ ఎక్కువగా వెతికిన పేర్లలో టాలీవుడ్ సినీ ప్రముఖులు అల్లు అర్జున్ - సమంత రూత్ ప్రభు లకు చోటు దక్కడం విశేషం.
యాహూ ప్రకటించిన ఇయర్-ఎండ్ లిస్ట్-2021లో అత్యధికంగా శోధించబడిన మేల్ సెలబ్రిటీగా సిద్ధార్థ్ శుక్లా మొదటి స్థానంలో నిలిచారు. 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన సిద్ధార్థ్ సెప్టెంబరు 2న హార్ట్ ఎటాక్ తో మరణించిన సంగతి తెలిసిందే.
'బిగ్ బాస్' టైటిల్ గెలుపొంది దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శుక్లా.. 40 ఏళ్ల వయసులోనే మరణించించడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలోనే అతని గురించి తెలుసుకోడానికి ఎక్కువ మంది నెట్ లో సెర్చ్ చేసారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. దేశ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సల్మాన్.. ఈ ఏడాది 'రాధే' 'అంతిమ్' వంటి సినిమాలతో అలరించారు. అలానే 'బిగ్ బాస్ 15' రియాలిటీ షో కు హోస్ట్ గా వ్యవహరించారు. ఈ విధంగా 2021లో ఎక్కువ మంది వెతికిన సెలబ్రిటీల జాబితాలో సల్మాన్ నిలిచారు.
ఇక మేల్ సెలబ్రిటీల లిస్టులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూడో స్థానం సంపాదించడం గమనార్హం. దక్షిణాదిన ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న బన్నీ.. 'అల వైకుంఠపురములో' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందున్నారు.
ఈ క్రమంలో అల్లు అర్జున్ హిందీ డబ్బింగ్ సినిమాలకు నార్త్ లో మంచి డిమాండ్ ఉంది. ప్రతి సినిమా మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంటూ ఉంటుంది. అందులోనూ ఇప్పుడు అల్లు అర్జున్ 'పుష్ప' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై హిందీ మార్కెట్ లో బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ లో బన్నీ గురించి ఎక్కువగా సెర్చ్ చేశారని తెలుస్తోంది.
యాహూ-2021 జాబితాలో నాలుగో స్థానంలో ఇటీవల హార్ట్ ఎటాక్ తో మరణించిన కన్నడ దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరియు ఈ ఏడాదే మృతి చెందిన దివంగత నటుడు దిలీప్ కుమార్ లు నిలిచారు.
ఇక ఈ లిస్ట్ లో షారుఖ్ ఖాన్ కుమారుడు, ఆర్యన్ ఖాన్ కు చోటు దక్కింది. డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ తో వార్తల్లో నిలిచిన ఆర్యన్.. ఏడో స్థానంలో ఉన్నాడు.
2021లో భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేయబడిన మహిళా సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ అగ్రస్థానంలో ఉంది.
యువ హీరో విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకోబోతున్న కత్రినా కైఫ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ప్రియాంక చోప్రా మూడో స్థానంలో నిలవగా.. ఆలియా భట్ - దీపికా పదుకొణె వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో సమంత పదో స్థానంలో నిలిచింది.
టాలీవుడ్ హీరో నాగచైతన్య తో నాలుగేళ్ళ వివాహానికి స్వస్తి పలికిన సామ్ నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. అలానే 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం అందుకుంది.
ఈ క్రమంలోనే ఎక్కువ మంది ఇంటర్నెట్ లో వెతికిన ఫీమేల్ సెలబ్రిటీల లో ఒకరిగా సమంత నిలిచిందని అర్థం అవుతోంది. ఇకపోతే యాహూ ఇయర్-ఎండ్ జాబితా-2021లో స్థానం సంపాదించిన అల్లు అర్జున్ - సమంత.. ఇప్పుడు 'పుష్ప' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తుండటం గమనార్హం.