Begin typing your search above and press return to search.
బన్నీ-చరణ్ ఓ మల్టీస్టారర్.. ఇదిగో టైటిల్!
By: Tupaki Desk | 18 Oct 2022 8:36 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇద్దరూ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలే. భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ తమదైన టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదుగుతూ అటు చరణ్, ఇటు బన్నీ.. పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి ఈ హీరోలు ఇద్దరు కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తే.. అబ్బబ్బా ఆ ఊహే ఎంత అద్భుతంగా ఉందో కదా! అయితే ఇది ఊహ కాదండోయ్ నిజం.
టాలీవుడ్ కు చెందిన ఓ బడా నిర్మాత రామ్ చరణ్-అల్లు అర్జున్ కాంబోలో మల్టీస్టారర్ సినిమా చేయాలని బలంగా కోరుకుంటున్నారు. ఇంతకీ ఆ బడా నిర్మాత మరెవరో కాదు అల్లు అరవింద్. అవును, ఈయన తన కొడుకు బన్నీ, మేనల్లుడు చరణ్ తో మల్టీస్టారర్ చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.
అంతేకాదు టైటిల్ కూడా లాక్ చేశారు. తాజాగా ప్రముఖ పాపులర్ టీవీ షో 'ఆలీతో సరదాగా' లో పాల్గొన్న అల్లు అరవింద్.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో 'భవిష్యత్తులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎటువంటి సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు?' అని ఆలీ ప్రశ్నించాడు.
అందుకు అల్లు అరవింద్ 'ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో.. కానీ నాకు ఒక కోరిక ఉంది. గీతా ఆర్ట్స్ లో అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ చేయాలని అనుకుంటున్నాను. అందుకోసం పదేళ్ల క్రితం 'చరణ్ - అర్జున్' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించా. ఆ టైటిల్ ని ఇప్పటికీ ప్రతి ఏడాది రెన్యువల్ చేస్తున్నాను. ఎప్పటికైనా సరే ఈ సినిమా పట్టాలెక్కుతుందనే ఆశ నాకు బలంగా ఉంది' అంటూ చెప్పుకొచ్చారు.
అల్లు అరవింద్ వ్యాఖ్యలతో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. వాస్తవానికి అల్లు అర్జున్, రామ్ చరణ్ లు కలిసి ఆల్రెడీ ఓ సినిమా చేశారు. అదే 'ఎవడు'. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ హీరో కాగా.. బన్నీ గెస్ట్ రోల్ చేశాడు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేములో కూడా కనిపించరు. కాబట్టి, ఆ సినిమాను పూర్తిస్థాయి మల్టీస్టారర్ అని చెప్పలేం.
కానీ, అల్లు అరవింద్ బన్నీ-చరణ్ లతో ఓ పూర్తి స్థాయి మల్టీస్టారర్ చేసేందుకు తెగ ముచ్చటపడుతున్నారు. పైగా గత కొద్ది రోజుల నుంచి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎన్నిసార్లు ఖండించినా ఈ వార్తలకు బ్రేక్ పడటం లేదు. ఒకవేళ రామ్ చరణ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ వస్తే శాశ్వతంగా ఈ వార్తలకు పులిస్టాప్ పడటం ఖాయమని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.