Begin typing your search above and press return to search.

నాన్న కూచి అర్హ కోసం సెట్లో బ‌న్ని ఫాల్క‌న్

By:  Tupaki Desk   |   7 Aug 2021 2:30 PM GMT
నాన్న కూచి అర్హ కోసం సెట్లో బ‌న్ని ఫాల్క‌న్
X
స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అత్యంత ఖ‌రీదైన `ఫాల్క‌న్-బ‌స్` గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సుమారు 7కోట్ల బ‌డ్జెట్ తో స‌క‌ల సౌకర్యాలతో తీర్చిదిద్దిన ప్ర‌త్యేక ల‌గ్జ‌రీ కార‌వాన్ ఇది. బ‌న్నీ ఎక్క‌డ షూటింగ్ కి వెళ్లినా సెట్స్ లో ఫాల్కన్ బ‌న్నీ కంటే ముందుగా ఉండాలి. బ‌న్నీ షాట్ గ్యాప్ లో కొన్ని నిమిషాలపాటు విశ్రాంతి తీసుకోవాల‌న్నా పాల్కాన్ లోకి వెళ‌తారు. కానీ స‌డెన్ గా ఏమైందో ఫాల్కాన్ బ‌న్నీకి అందుబాటులో లేద‌ని తెలిసింది. ఫాల్క‌న్ కి బ‌దులుగా ఓ స్టాండ‌ర్డ్ కార‌వాన్ ని ఏర్పాటు చేసుకోవాల్సి వ‌చ్చింద‌ట‌. మ‌రి పాల్కాన్ రిపేర్ వ‌గైరా ఏమైనా జ‌రిగిందా? అంటే అదీ లేదు. కేవ‌లం త్యాగం చేయ‌డంతోనే బ‌న్నీ స్టాండ‌ర్డ్ కార్వాన్ వినియోగించాల్సి వ‌స్తోంది. అస‌లు విష‌యంలోకి వెళ్తే..

అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కోసం ఫాల్క‌న్ ని పంపించార‌న్న‌ది తాజా గుస‌గుస‌. అక్కినేని స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో గుణ‌శేఖ‌ర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న `శాకుంత‌లం` సెట్స్ లో అల్లు అర్హ బిజీగా ఉంది. అర్హ ఈ చిత్రంలో బాల న‌టిగా న‌టిస్తోంది. అర్హ‌కి తొలి ప‌రిచ‌య చిత్రం కావ‌డంతో త‌న‌ రోల్ కూడా అంతే ప్రాధాన్యత‌ను క‌లిగి ఉందిట‌. ఈ నేప‌థ్యంలో అర్హ రెగ్యుల‌ర్ గా శాకుంత‌లం షూటింగ్ కి హాజ‌ర‌వ్వాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ద‌ర్శ‌కుడి నుంచి అర్హ‌కి పిలుపు రావ‌డంతో షూటింగ్ కి రెడీ అయింది. అటు బ‌న్నీ న‌టిస్తున్న `పుష్ప` చిత్రీక‌ర‌ణ‌ కూడా నిర్విరామంగా జ‌రుగుతోంది. బ‌న్నీ బ్రేక్ ఇవ్వ‌డానికి లేదు. ఇలా రెండు సినిమాలు షూటింగ్ లో ఉండ‌టం...బ‌న్నీ..అర్హ కూడా ఒకేసారి సెట్స్ కు హాజ‌ర‌వుతుండ‌డంతో బ‌న్నీనే కుమార్తె కోసం అలా అడ్జ‌స్ట్ అవుతున్నారు.

గారాల కుమార్తె కోసం బ‌న్నీ పాల్కాన్ ని కేటాయించారు. అర్హ‌కి షూటింగ్ ఉన్నంత కాలం పాల్క‌న్ త‌న వ‌ద్ద ఉండాల‌ని బ‌న్నీ ఆదేశాలు ఇవ్వ‌డంతో పాల్క‌న్ ఇప్పుడు అర్హ అండ‌ర్ లో ఉంది. అర్హ‌తో పాటు షూటింగ్ సెట్ లో ఫాల్కన్ ఉంటుంది. ఫాల్కాన్ అర్హ‌తో లేక‌పోతే సెట్స్ లో ఇబ్బంది ప‌డుతుంద‌ని భావించి బ‌న్నీ అన్ని సౌక‌ర్యాలు ఉన్న త‌న కార‌వ్యాన్ ని కుమార్తెకు కేటాయించిన‌ట్లు తెలుస్తోంది. ఇక బ‌న్నీ సాధార‌ణ కార‌వాన్ ని వాడుతున్నారు. కూతురంటే బ‌న్నీకి ఎంత ప్రేమో క‌దా..!