Begin typing your search above and press return to search.
ప్లాన్ చేసి మరీ.. పాన్ ఇండియా స్టార్
By: Tupaki Desk | 6 Jan 2022 12:30 PM GMTఇప్పుడు టాలీవుడ్ లో ఏ హీరోని కదిలించినా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట పాన్ ఇండియా సినిమా. `బాహుబలి` తరువాత మన సినిమాల మార్కెట్, బడ్జెట్ పెరిగిపోవడం.. అందుకు తగ్గట్టుగానే మన సినిమాలకు దేశ వ్యాప్తంగా బిజినెస్ జరుగుతుండటంతో చాలా మంది హీరోలు పాన్ ఇండియా స్థాయి సినిమాలపై కన్నేశారు. ఇందులో ముందుగా సక్సెస్ అయిన హీరో ప్రభాస్. `బాహుబలి` సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే.
ఆయన వల్లే తెలుగు సినిమా స్వరూపమే మారిపోయింది. ప్రతీ ఒక్కరూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాని కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో ప్రభాస్ తరువాత సక్సెస్ అయింది మాత్రం ఒక్కరే.. అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. `అల వైకుంఠపురములో` సినిమాకి ముందు దాదాపు మూడేళ్లు నా కెరీర్ ఏంటీ? ఎటు వెళుతున్నానని స్ట్రగుల్ అయ్యాడు. భారీ అంచనాలు పెట్టుకుని క్యారెక్టర్ కోసం తనని తాను మార్చుకుని చేసిన `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` ఆశించిన ఫలితాన్ని అందించక బన్నీని డిసప్పాయింట్ చేసింది.
దీంతో ఆలోచనలో పడ్డ బన్నీ `అల వైకుంఠపురములో`తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఎలాగైనా పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందుకు సుకుమార్ చెప్పిన గంధపు చక్కల స్మగ్లర్ `పుష్ప` కథ కరెక్ట్ అని భావించి దానిపై ఫోకస్ పెట్టాడు. ముందు ఒకే సినిమా అనుకున్న సుకుమార్, బన్నీ ఆ తరువాత దీన్ని టూ పార్ట్స్ గా మార్చి పార్ట్ 1తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
డిసెంబర్ 17న విడుదలైన ఈ మూవీ ఊహించని స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తూ బన్నీని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. స్టార్ లు గా ఎదగాలని చాలా మంది కోరుకుంటారు కానీ పాన్ ఇండియా స్థాయిలో స్టార్ లుగా గుర్తింపుని సొంతం చేసుకోవడం చాలా కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భావించి బన్నీ తాను అనుకున్నట్టుగానే `పుష్ప`తో పాన్ ఇండియా అయ్యాడు. అనుకోకుండా ప్రభాస్ `బాహుబలి` సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారితే బన్నీ ప్లాన్ చేసుకుని మరీ పాన్ ఇండియా స్టార్ గా మారడం నిజంగా విశేషమే.
ఓ ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయిలో నిలబెట్టి నేషనల్ సినిమాగా మార్చిన ఘనత నీదేనంటూ రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు బన్నీ పై ప్రశంసల వర్షం కురిపించారు. దీన్ని బట్టే ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారడానికి ఏ స్థాయిలో బన్నీ శ్రమించారో అర్థం మవుతోంది. సెల్ఫ్ మేడ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి బన్నీ తన పంతం నెగ్గించుకున్న తీరుని ప్రశంసిస్తున్న వారంతా `బన్నీ తగ్గేదేలే...` అని కామెంట్ లు చేస్తున్నారు.
ఇదిలా వుంటే ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్ లలో మునిగితేలుతున్న దర్శకుడు సుకుమార్ పార్ట్ 2ని రెడీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఊహించని స్థాయిలో `పుష్ప ది రైజ్` సక్సెస్ కావడం.. హిందీ వెర్షన్ 70 కోట్ల మార్కుని చేరడంతో పార్ట్ 2 స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారట. మార్చి కి స్క్రిప్ట్ పూర్తి చేసి సినిమాని అక్టోబర్ కల్లా ముగించేయాలని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.