Begin typing your search above and press return to search.
చెర్రీ కంటే బన్నీనే బెస్ట్ డ్యాన్సర్! సుస్మిత కొణిదెల
By: Tupaki Desk | 20 March 2020 11:30 PM GMTటాలీవుడ్ లో ఎవరు బెస్ట్ డ్యాన్సర్? అభిమానుల్లో నిరంతరం హాట్ టాపిక్ ఇది. బన్ని .. చరణ్.. ఎన్టీఆర్ .. ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్ డ్యాన్సర్? అన్నదానిపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తుంటాయి. ఎన్టీఆర్ సంగతి అటుంచితే బన్నిచరణ్ ఇద్దరూ మెగా హీరోలు కాబట్టి ఆ విషయాన్ని నేరుగా మెగాడాటర్ సుస్మిత కొణిదెలనే అడిగేస్తే ఏమన్నారో తెలుసా?
ఏ అక్క అయినా తమ్ముడికే సపోర్ట్ గా ఉంటుందని భావిస్తాం. కానీ `బెస్ట్ డ్యాన్సర్` ఆప్షన్ లో మాత్రం సుస్మిత కొణిదెల డిఫరెంటుగా స్పందించి ఆశ్చర్యపరిచారు. ఓ ఇంటర్వ్యూలో సుస్మిత కొణిదెల మాట్లాడుతూ చరణ్ కంటే బన్ని బెస్ట్ డ్యాన్సర్ అని కితాబిచ్చేశారు. ఒక రకంగా ఇది షాకింగ్ కామెంట్ అనే చెప్పాలి. సుస్మిత కామెంట్ కి చరణ్ అభిమానులు చిన్నబుచ్చుకున్నారు. అయితే తన తమ్ముడు చరణ్ గురించి అలాగే బన్ని బావ గురించి సుస్మిత తనకు తెలిసిన పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.
బన్ని చిన్నప్పటి నుంచి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అందులో డ్యాన్సులు చేసేవాడని .. కానీ చరణ్ అలా కాదని కూడా సుస్మిత వెల్లడించారు. బన్నీనే ఇలాంటి వేడుకల్లో అన్నీ తానే అయ్యి డ్యాన్సులకు ముందుండేవాడని వెల్లడించింది. అప్పటి నుంచే బన్ని బెస్ట్ డ్యాన్సర్ అని ఇంట్లో అంతా అనుకునే వాళ్లమని తెలిపారు. చరణ్ చక్కగా డ్యాన్స్ చేస్తాడు. కానీ బన్ని అంత కాదు! అంటూ నిజాయితీగా సుస్మిత అనడాన్ని బట్టి తన గట్స్ ని ముక్కుసూటి తనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు ఫ్యాన్స్. అయితే చెర్రీ ఫ్యాన్స్ మాత్రం సుస్మిత వ్యాఖ్యపై గుర్రుగా ఉన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవిని టాలీవుడ్ లో ఎవరు బెస్ట్ డ్యాన్సర్? అని అడిగేస్తే డెఫినెట్ గా చరణ్ మాత్రమేనని చెబుతారు. అయితే తన డాటర్ మాత్రం బన్నీకే ఓటేశారు మరి.