Begin typing your search above and press return to search.
కరోనా లాక్ డౌన్ ను కవర్ చేసేలా బన్నీ ప్లానింగ్
By: Tupaki Desk | 25 Aug 2021 5:30 AM GMTకరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా పరిశ్రమ దాదాపుగా ఆరు నుండి పది నెలల పాటు పూర్తిగా మూత పడ్డట్లుగా అయ్యింది. చాలా మంది హీరోలు ఏడాది పాటు పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. గత ఏడాది ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా కూడా కొందరు కరోనా వల్ల సినిమాలను మొదలు పెట్టలేని పరిస్థితి. ఎట్టకేలకు అయినా మళ్లీ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. సినిమా షూటింగ్ లు మొదలు అయ్యాయి. గత ఏడాది కాలం వృదా అయినందుకు చాలా మంది హీరోలు చాలా స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే యంగ్ హీరోలు పలువురు కరోనా వల్ల వచ్చిన గ్యాప్ ను ఫిల్ చేసేందుకు గాను వరుసగా సినిమాలను విడుదల చేసేందుకు రెడీ చేసి పెడుతున్నారు. అల్లు అర్జున్ కూడా అదే ప్లాన్ చేస్తున్నట్లుగా ఉన్నాడు.
టాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప రెండు పార్ట్ లు మరియు మద్యలో వచ్చే ఐకాన్ సినిమాల విషయంలో బన్నీ చాలా స్పీడ్ గా దూసుకు పోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. పుష్ప పార్ట్ 1 చిత్రీకరణ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. వచ్చే నెలలో సినిమా షూటింగ్ ను ముగించేలా సుకుమార్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది. కరోనా మొదటి వేవ్ మరియు సెకండ్ వేవ్ ల ప్రభావం ఈ సినిమాపై తీవ్రంగా పడింది. అయినా కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా దర్శకుడు సుకుమార్ పుష్ప పార్ట్ 1ను సెప్టెంబర్ వరకు ముగించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ లో పుష్ప 1 పూర్తి అయితే వెంటనే ఐకాన్ ను మొదలు పెట్టేందుకు గాను బన్నీ సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
అల్లు అర్జున్ తో ఇప్పటికే ఐకాన్ సినిమా ను వేణు శ్రీరామ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా ముగించాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దిల్ రాజు బ్యానర్ లో రూపొందబోతున్న ఐకాన్ సినిమా ను అక్టోబర్ లో పట్టాలెక్కించడం దాదాపుగా కన్ఫర్మ్ అంటున్నారు. సినిమాను కేవలం నాలుగు లేదా అయిదు నెలల్లో పూర్తి చేసేలా వేణు శ్రీరామ్ కు డేట్లు ఇచ్చాడట. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను డిజైన్ చేశాడు. కరోనా ఇబ్బందులు తలెత్తకుంటా ఉంటే వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి వరకు ఐకాన్ సినిమాను ముగించేయనున్నాడు. ఆ వెంటనే ఏప్రిల్ లేదా మే లో పుష్ప 2 సినిమాను పట్టాలెక్కించేలా బన్నీ ప్లాన్ చేస్తున్నాడు. బన్నీ కరోనా లాక్ డౌన్ టైమ్ వృదా అయినందుకు గాను ఇలా వరుసగా సినిమాలు చేస్తూ బ్యాలన్స్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. కేవలం బన్నీ మాత్రమే కాకుండా ఇలా ప్రతి ఒక్క హీరో కూడా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు.
చిన్న హీరోలు అయితే నాలుగు అయిదు సినిమాలను వచ్చే ఏడాదికి విడుదల చేసేందుకు గాను ప్లాన్ చేస్తున్నారు. బన్నీ అభిమానులకు ఖచ్చితంగా ఇది పండుగలాంటి వార్త అనడంలో సందేహం లేదు. అల్లు అర్జున్ పుష్ప 1 ను ఈ ఏడాది చివర్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఐకాన్ సినిమాను వచ్చే ఏడాది దసరా వరకు విడుదల చేస్తారేమో చూడాలి. పుష్ప 2 వచ్చే ఏడాది చివర్లో లేదా 2023 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా అల్లు అర్జున్ కన్నడ స్టార్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇంకా రెండు మూడు సినిమాలు కూడా కమిట్ అయ్యాడు. మొత్తానికి ఐకానిక్ స్టార్ అన్ని విధాలుగా అభిమానులను సంతృప్తిపర్చేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తున్నాడు.