Begin typing your search above and press return to search.
పుష్ప ఈవెంట్లో బన్నీ నెక్ట్స్ డైరెక్టర్స్
By: Tupaki Desk | 13 Dec 2021 4:19 AM GMTపుష్ప - ది రైజ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్నటి సాయంత్రం ఎంతో వైభవంగా సాగింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్య అతిథిగా సాగిన ఈ ఈవెంట్లో బన్ని-రష్మిక ఇతర టీమ్ సందడి చేసింది. అయితే ఇదే వేదికపై దర్శకులు మారుతి.. బుచ్చిబాబు కూడా సందడి చేశారు. ఇప్పటికే ఆ ఇద్దరూ బన్నీ కోసం కథలు రెడీ చేస్తున్నారు. స్క్రిప్టుల్ని ఫైనల్ చేసి బన్నీని ఒప్పించేందుకు సిద్ధంగా ఉన్నారన్న గుసగుస వినిపిస్తోంది.
పుష్ప వేడుకలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ``అల్లు అర్జున్ అంటేనే ఎనర్జీ.. ఆయన అభిమానులు అంతే. సినిమా కోసం బన్నీ ప్రాణం పెడతాడు. వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ స్టామినా ఏమిటో తెలుస్తోంది.
మొన్న కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి తాను అల్లు అర్జున్ అభిమాని అంటూ గర్వంగా చెబుతుంటే నేను కూడా గర్వంగా ఫీలయ్యాను. బన్నీ తెలుగు వాడు అయినందుకు అందరం గర్వపడాలి. పుష్ప అద్భుత విజయం సాధిస్తుంది`` అన్నారు.
అలాగే దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. ``నా గురువు సుకుమార్ గారి గురించి ప్రత్యేకంగా నేనేం చెప్పేది లేదు. ఈరోజు ఆయన ముంబైలో పుష్ప- డీటీఎస్ మిక్సింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయనను రావాలని కోరితే.. మన అందరి కంటే సినిమా పెద్దది రా అన్నారు.
సినిమా చేసిన వాడు పోతాడు.. చూసినవాడు పోతాడు కానీ సినిమా శాశ్వతం అంటుంటారు మా గురువుగారు. పుష్ప బన్ని కెరీర్ లో ప్రత్యేకంగా మిగిలిపోతుంది. బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి గురూజీ ఎప్పుడు ముందుంటారు. ఈ సినిమాకోసమే వెయిటింగ్`` అని అన్నారు.
మారుతి.. బుచ్చిబాబు ఇద్దరూ సక్సెస్ ఉన్న దర్శకులు. ఆ ఇద్దరూ స్టార్ డైరెక్టర్లతో పని చేయాలన్న కసితో ఉన్నారు. నవతరానికి ప్రోత్సాహాన్నిచ్చే బన్నీ వారిని నిరాశపరచరు.
బన్ని క్యూలో అగ్రదర్శకులు ఉన్నా నవతరం కొత్తదనం నిండిన బౌండ్ స్క్రిప్ట్ తో మెప్పిస్తే వెంటనే సెట్స్ కెళ్లే ఛాన్సుంటుంది. త్వరలోనే ఈ కాంబినేషన్లు వర్కవుటవుతాయనే అభిమానులు భావిస్తున్నారు. బుచ్చిబాబు ఉప్పెన తర్వాత రెండు సినిమాల డీల్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.