Begin typing your search above and press return to search.
బన్నీ నార్త్ ఫ్యాన్స్ ఆగ్రహం.. గోల్డ్ మైన్ తీరుపై ట్రోల్స్
By: Tupaki Desk | 9 Feb 2022 1:30 AM GMTఅల్లు అర్జున్ హీరోగా గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నార్త్ ఇండియాలో వంద కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న పుష్క తో అల్లు అర్జున్ అక్కడ స్టార్ అయ్యాడు. దాంతో ఇప్పుడు ఆయన పాత సినిమాలను డబ్బింగ్ చేసి వదిలేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పుష్ప సినిమా జోరు కొనసాగుతున్న సమయంలోనే అల్లు అర్జున్ గత చిత్రం అయిన అల వైకుంఠపురంలో సినిమా ను డబ్బింగ్ చేసి థియేటర్ రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఇప్పటికే ఆ సినిమా రీమేక్ మొదలు అయ్యింది కనుక డబ్బింగ్ వర్షన్ ను థియేటర్ లో విడుదల చేసే విషయమై వివాదం ఏర్పడి గోల్డ్ మైన్ వారు థియేటర్ రిలీజ్ ఆలోచన నుండి వెనక్క తగ్గారు.
అల వైకుంఠపురంలో సినిమా డబ్బింగ్ రైట్స్ ను దక్కించుకున్న గోల్డ్ మైన్స్ వారు థియేటర్ రిలీజ్ చేయలేక పోయినా యూట్యూబ్ ద్వారా తీసుకు వస్తామంటూ ప్రకటించారు. ఈనెల 6వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా హడావుడి చేశారు. పుష్ప సినిమా తో అల్లు అర్జున్ కు వచ్చిన స్టార్ డమ్ కారణంగా అల వైకుంఠపురంలో సినిమా హిందీ వర్షన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఉత్తరాది ప్రేక్షకుల ఎదురుచూపులకు తెర పడే రోజు రానే వచ్చింది. కాని వారు అంతా కోరుకున్నట్లుగా అల వైకుంఠపురంలో హిందీ వర్షన్ అయితే వచ్చింది కాని యూట్యూబ్ లో మాత్రం గోల్డ్ మైన్స్ వారు స్ట్రీమింగ్ చేయలేదు. దాంతో నార్త్ బన్నీ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గోల్డ్ మైన్స్ వారు అల వైకుంఠపురంలో సినిమా ను యూట్యూబ్ లో కాకుండా డించాక్ అనే ఒక యాప్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. డించాక్ టీవీ అంటూ ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ఆ డించాక్ టీవీలో అల వైకుంఠపురం సినిమా ను స్ట్రీమింగ్ చేశారు. ఫ్రీగానే ఆ యాప్ ను యూజ్ చేయవచ్చు. కాని యూట్యూబ్ అంతగా అది ఈజీగా ఉండదు. దాంతో ప్రేక్షకులు ఇప్పుడు డించాక్ టీవీని ఎలా చూడాలో తెలియక యూట్యూబ్ లో విడుదల చేయకుండా అక్కడ విడుదల చేసినందుకు గాను గోల్డ్ మైన్స్ వారిపై ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా యూట్యూబ్ లో హిందీ అల వైకుంఠపురంలో సినిమాను స్ట్రీమింగ్ చేయాలంటూ గోల్డ్ మైన్స్ సంస్థ ను సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్ నార్త్ అభిమానులు కోరుతున్నారు. మరి యూట్యూబ్ లో హిందీ అల వైకుంఠపురం వచ్చేనా చూడాలి.