Begin typing your search above and press return to search.
అప్పట్లో `సింహా` సినిమాకి బన్ని ఇలానే చెప్పాడు!
By: Tupaki Desk | 2 Sep 2021 6:30 AM GMTబాగా నటిస్తే ప్రత్యర్థిని అయినా పొగిడేసే టైపు బన్ని. ఇటీవలి కాలంలో కంటెంట్ ఉన్న సినిమాలకు హీరోలకు అల్లు కాంపౌండ్ కానీ మెగా కాంపౌండ్ కానీ సపోర్ట్ గా నిలిచేందుకు వెనకాడడం లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీ సహోదరులందరి కోసం పార్టీలు ఏర్పాటు చేసి యునైట్ చేసేందుకు ప్రయత్నించారు. సాటి హీరోలు ఎదగాలని కోరుకునే మంచి తత్వం బన్నీకి సొంతం. బాలీవుడ్ తో పోలిస్తే నెపోటిజం అనేది టాలీవుడ్ లో పరిమితం అనే సిగ్నల్స్ ఇలాంటి స్టార్ హీరోల మేనరిజం తెలియజెబుతుంది.
తాజాగా బన్ని ``ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన షేర్షా`` అంటూ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా సినిమాని ప్రశంసించారు. అల్లు అర్జున్ తాజా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ షేర్షాను వీక్షించారు. ఈ సినిమా బాగా నచ్చింది. షర్షా బ్రందాన్ని ప్రశంసించారు. వరుస ట్వీట్లలో అల్లు అర్జున్ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పారు.
``#షేర్షా మొత్తం బృందానికి అభినందనలు. హృదయానికి హత్తుకునే సినిమా ఇది. మిస్టర్ సిద్ధార్థ్ మల్హోత్రా మీ కెరీర్ ఉత్తమ ప్రదర్శనతో మనసు దోచారు. కియరా అద్వాణీ ఇతర నటీనటుల ప్రభావవంతమైన ప్రదర్శన ఆకట్టుకుంది. టెక్నీషియన్స్ అందరికీ నా గౌరవాభివందనాలు. దర్శకుడు విష్ణువర్ధన్ అద్భుతమైన కన్విక్షన్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. సర్.. మీరు మా అందరిని గర్వపడేలా చేసారు. కరణ్ జోహార్ జీ ఇతర నిర్మాతలకు అభినందనలు. ఈ బ్లాక్ బస్టర్ హిట్ ని ప్రేక్షకుల కోసం తెచ్చిన ప్రైమ్ వీడియోకి అభినందనలు. ప్రతి భారతీయుడు తప్పక చూడాలి`` అని అల్లు అర్జున్ ట్వీట్ చేసారు. బన్ని ఇంతకుముందు కొన్ని మంచి సినిమాలకు తనవంతుగా ప్రచార సాయం చేశారు. ఇండస్ట్రీలో మంచి సినిమా వచ్చింది అంటే దానిపై ట్వీట్లు వేసేందుకు వెనకాడలేదు. అప్పట్లో నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన సింహా బాక్సాఫీస్ కలెక్షన్లపైనా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసినదే. ఇండస్ట్రీలో ఫలానా సినిమా బావుంది అంటే ఆ చిత్రబృందాన్ని బన్ని ప్రత్యేకించి అభినందిస్తుంటారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో షేర్ షా ప్రస్తుతం తమ ప్లాట్ ఫామ్ లో నంబర్ వన్ ఫిల్మ్ అని ప్రకటించింది. 1999 లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చొరబాటుదారుల నుండి భారత భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటూ దేశ సేవలో ప్రాణాలు అర్పించిన కెప్టెన్ విశాల్ భాత్రా జీవిత కథలో సిద్ధార్థ్ మల్హోత్రా నటించారు. విష్ణువర్ధన్ దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్- కాష్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవలి కాలంలో ప్రైమ్ లో గొప్ప ఆదరణ దక్కించుకుంటున్న చిత్రంగా రికార్డులకెక్కింది. ఇప్పుడు ప్రముఖుల ప్రశంసలు దక్కించుకుంటోంది. బన్ని కంటే ముందే విశ్వనటుడు కమల్ హాసన్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
ఇండస్ట్రీ సహోదరులతో క్లబ్ యాక్టివిటీస్..
టాలీవుడ్ లో సాటి హీరోలందరినీ కలుపుతూ ఒక స్పెషల్ క్లబ్ ని స్థాపించారు బన్ని. ఇందులో దగ్గుబాటి రానా సహా పలువురు యువ హీరోలు దర్శకులు కూడా ఉన్నారు. వీరంతా నిరంతరం తెలుగు సినీపరిశ్రమలో మంచి సినిమాల గురించి గొప్ప కథల వెల్లువ గురించి చర్చించారు. సోదర భావంతో సాటి హీరోల ఎదుగుదలకు సహకరించే మంచి వాతావారణాన్ని క్రియేట్ చేయడం అప్పట్లో చర్చకు వచ్చింది. ఇటీవల కరోనా క్రైసిస్ వల్ల కొంత యాక్టివిటీస్ నెమ్మదించినట్టే కనిపిస్తోంది. మునుముందు దీని పునరుద్ధరణకు బన్ని- రానా అండ్ టీమ్ కృషి చేస్తారనే భావిద్దాం.